ప్రజాశక్తి-భట్టిప్రోలు (బాపట్ల) : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లటూరులో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గుర్రం మురళీమోహన్ గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సందర్భంగా … 2025 ఏప్రియల్ 14 న హైదరాబాదులో సమాజ సేవ చేస్తున్న వారికి, ప్రపంచ శాంతి కోసం పాటుపడేవారికి, మానవ హక్కుల కోసం పోరాడే వారికి మనం ఫౌండేషన్ (నీతి అయోగ్ ఆమోదం పొందిన సంస్థ) ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లటూరులో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గుర్రం మురళీమోహన్ కు గౌరవ డాక్టరేట్ ను డాక్టర్ ఆఫ్ హ్యుమానిటీ అనే విభాగము లో నిన్న హైదరాబాదులో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సిటీ కల్చర్ కళావేదికలో ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఉపాధ్యాయుడిగా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటంలో, కృష్ణా నది వరదల సమయంలో విద్యార్థిని విద్యార్థులకు చేసిన సేవలకు గుర్తింపుగా, సంఘ నాయకుడిగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు చేసిన సేవలకు గుర్తింపుగా భారత్ సేవా రత్న జాతీయ అవార్డును 2025 ను ఇవ్వడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మనం ఫౌండేషన్ చైర్మన్ కె చక్రవర్తి, దైవాజ్ఞ శర్మ సరస్వతి, శ్రీరామ్ మూర్తి, త్రినాధ రావు, శ్రీపాద , సుబ్బరాజు, కె అర్చన, డాక్టర్ శివ లీల, తదితరులు పాల్గొన్నారు.
