పొగమంచుతో పూతరాలె – మామిడి రైతులకు కన్నీరు మిగిలె..!

ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : పొగమంచు వల్ల మామిడి పంటలకు ముప్పు పొంచి ఉందని రైతులు వాపోతున్నారు. శుక్రవారం రైతులు మాట్లాడుతూ … వేపాడ మండలంలోని సుమారు 2.220 హెక్టార్లలో మామిడి, జీడి పంటల తోటల రైతులు సాగు చేస్తున్నారని అన్నారు. వేపాడ, వీలు పరితి.వావిలపాడు. నల్లబెల్లి. గుడిపాల, ఎన్‌ కె ఆర్‌ పురం, బల్లంకి, బానాది, ఆతవ, జాకేరు, కోరుకోవాలి, మారిక, కెజి.పూడి, తదితర గ్రామాలలో మామిడి రైతులు సాగు చేస్తున్నారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న పొగ మంచు కారణంగా పూత దశలోనే పూత మాడిపోతుందని వాపోయారు. చెట్ల ఆకులు కూడా నేల రాలిపోతున్నాయన్నారు. డిసెంబర్‌ నెలలో పడిసిన వరస వల్ల మామిడి తోటలకు కొంత నష్టం కలిగినప్పటికీ తేరుకొనే సమయానికి మంచు ప్రభావం వలన ఈ ఏడాది మామిడి తోటల రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదో అని ఆవేదనను వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులను వివరణ కోరగా పొగ మంచు వల్ల రైతులకు కొంత నష్టం జరిగే అవకాశం ఉన్నదని అన్నారు. అయితే ఇదే విధంగా పొగ మంచు అధికంగా కురిస్తే పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని మామిడి తోట యజమానులు తమ ఆవేదనను వినిపిస్తున్నారు.

➡️