ప్రజాశక్తి -వెదురుకుప్పం: కార్వేటినగరం మండలంలో ‘సమస్య మీది పరిష్కారం మాది’ కార్యక్రమాన్ని టిడిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఇందుకోసం టిడిపి నాయకులు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి , పరిశీలించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చెంగల రారు యాదవ్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ రెడ్డి, జిల్లా పార్లమెంట్ రైతు అధ్యక్షులు నాగేశ్వరాజు, బీసీ సెల్ అధ్యక్షులు రవి యాదవ్,మండల ఎస్సీ సెల్ ఉప అధ్యక్షులు చెంగల రాయలు ,చిరంజీవి, మండల యువత మురళి,రాము, చంద్ర మౌళి రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు
