ప్రజాశక్తి-తంబళ్లపల్లె మండల కేంద్రంలో మంగళవారం టిడిపి శ్రేణులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి ఇంటిని చుట్టు ముట్టారు. ఇంతలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం వరకు బైఠాయించారు. ములకలచెరువు సిఐ మధు, ఎస్‌ఐ శివ కుమార్ ఎంత సర్దిచెప్పినా వినలేదు. విషయాన్ని మద నపల్లి డిఎస్‌పి ప్రసాద్‌రెడ్డి దష్టికి తీసుకెళ్లారు. డిఎస్‌పి సంఘటన స్థలానికి చేరుకొని టిడిపి నాయకులు సర్దిచెప్పినా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నిరసన కార్యక్రమాన్ని విరమించి వెళ్లిపోయారు. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
