కష్టపడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు

May 14,2024 21:55

ప్రజాశక్తి- శృంగవరపుకోట : సార్వత్రిక ఎన్నికలలో భాగంగా సోమవారం జరిగిన ఎన్నికల ఓటింగ్‌లో పార్టీల గెలుపునకు సహకరించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు కూటమి అభ్యర్థి కోళ్ల లలిత కుమారి, వైసిపి అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు వేర్వేరుగా కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం లక్కవరపుకోట మండలంలోని కోళ్ల లలిత కుమారి నివాసం వద్దకు చేరుకున్న టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అందరూ బాగా కృషి చేశారని టిడిపి విజయం సాధిస్తుందని ఆమె అన్నారు. కొత్తవలసలోని ఎమ్మెల్యే కడుబండి తన నివాసం వద్ద వైసిపి నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మళ్లీ వైసిపి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తద్వారా కార్యకర్తల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఆయన చెప్పారు. ఎస్‌కోటలో 85.45 శాతం పోలింగ్‌ నమోదుగతం కంటే పెరిగిన పోలింగ్‌ శాతం సార్వత్రిక ఎన్నికలలో భాగంగా సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్‌ 85.45 శాతంగా నమోదయిందని ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్‌ నారాయణమ్మ తెలిపారు. నియోజకవర్గంలో 2,22,475 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,90,104 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఓటుహక్కు వినియోగించుకున్న వారిలో పురుషులు 92,379 మంది, మహిళలు 97,724 మంది, ఇతరులు ఉన్నారని చెప్పారు. 2019 ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్‌ శాతం పెరిగింది. 2019లో నియోజకవర్గంలో 2,12,623 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,82,199 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతం కంటే ఓట్లు శాతం కూడా పెరగడంతో టిడిపి వైసిపి అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సహకరించిన ఓటర్లకు అభినందనలు : మీసాల గీత విజయనగరం కోట : ఎన్నికల్లో తనకు సహకరించిన కార్యకర్తలు, అభిమానులు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మీసాల గీత తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రచారంలో తనకు ఎంతో మంది ప్రజలు ఆదరాభిమానాలు చూపారని తెపారు. కార్యకర్తలు కూడా రాత్రి, పగలు అనే తేడా లేకుండా తన విజయం కోసం పాటుపడ్డారని తెలిపారు. ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలుప్రజాశక్తి- వియజనగరం కోట ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని కూటమి ఎమ్‌పి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక అశోక్‌ బంగ్లా టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సోమవారం జిలా ్లవ్యాప్తంగా జరిగిన పోలింగ్‌లో ఓటింగ్‌ అధిక శాతం జరిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. విజయనగరం నియోజకవర్గంలో గుంకలం గ్రామంలో అందరూ బ్లైండ్‌ అని చెప్పి వైసిపి వారు ఓట్లు వేయడానికి ప్రయత్నించారని దాన్ని తిప్పి కొట్టి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా వలస కార్మికులు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆశాబావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి పాలవలస యశస్వినీ, బిజెపి నాయకులు రెడ్డి పావని పాల్గొన్నారు.

➡️