రసాయనిక ఎరువులు, పురుగుమందులు ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే అమ్మాలి : ముసునూరు మండల వ్యవసాయ అధికారి

ప్రజాశక్తి-ముసునూరు (ఏలూరు) : రసాయనిక ఎరువులు, పురుగుమందులు ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే అమ్మాలని ముసునూరు మండల వ్యవసాయ అధికారి ఎస్‌. మధుమోహన్‌ ఆయా షాపు యజమానులతో అన్నారు. మండల కేంద్రమైన ముసునూరు మురళి ట్రేడర్స్‌ షాపు లో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. 1985 ఎరువుల నియంత్రణ చట్టం ప్రకారం సెప్టెంబర్‌ నెలలో తనిఖీలో భాగంగా, చెక్కపల్లి గ్రోమోర్‌ షాపులో పురుగుమందులను, రసాయనిక ఎరువులను పరిశీలించి, ఆయా రికార్డులు అధికార పూర్వకంగా ఉన్నాయా ? లేదా ? అని తనిఖీలు చేశారు. రైతులు కూడా పురుగుమందులైన, రసాయనక ఎరువులైన కొనుగోలు చేసిన వెంటనే రసీదు తీసుకుని, ఆ రసీదు ఆ పంట పూర్తయ్యే వరకు తమ దగ్గర ఉంచుకుని ఏదైనా ఆ పంటలో తేడా వచ్చినట్లయితే తమరు దగ్గరికి రావాలని రైతులకు తెలియజేశారు. ఉద్యానవన సహాయ అధికారి శ్రీనివాస్‌ కూడా పాల్గొన్నారు.

➡️