పజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్: యువతలో దేశభక్తి పెంపొందించటమే లక్ష్యమని స్టెప్ సీఈవో ఎంవిఎస్ లోకేశ్వరరావు తెలిపారు. ‘ఆజాదీ కా అమత్ మహౌత్సవంలో భాగంగా ”హర్ ఘర్ తిరంగా ర్యాలీ శ్రీ ప్రతిభ జూనియర్ కళాశాలలో గురువారం ఉత్సాహంగా జరిగింది. స్టెప్ ఆధ్వర్యంలో శ్రీ ప్రతిభ జూనియర్ కాలేజీ నుండి పేర్నమిట్ట వరకు 1500 మంది యువతీ యువకులతో ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టెప్ సిఈఒ ఎంవిఎస్ లోకేశ్వర రావు మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆజాదీ కా అమత్ మహౌత్సవం కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుల కషి, త్యాగాలను స్మరించుకుంటూ యువతలో దేశ భక్తిని పెంపొందిస్తున్నామన్నారు. శ్రీ ప్రతిభ కళాశాలల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ యువత మంచి క్రమశిక్షణతో మెలిగి దేశం పట్ల భక్తి భావాలను కలిగి ఉండాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా వుండి దేశాభివద్ధిలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం యువతతో తిరంగా ప్రతిజ్ఞ చేయించి 1500 మంది యువతతో 75 అడుగుల జాతీయ పతాకంతో తిరంగా యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టెప్ మేనేజర్ పువ్వాడ శ్రీమన్నారాయణ, నెహ్రూ యువకేంద్ర జిల్లా యూత్ ఆఫీసర్ కమల్, ప్రతిభ కళాశాలల వైస్‌చైర్మన్ నల్లూరి సీతారామాంజనేయులు, స్టెప్ అకౌంటెంట్ జిబిఆర్ ప్రసాద్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
