ప్రజాశక్తి – ఆలమూరు : మండలంలోని బడుగువానిలంకలో ఇంటింటికీ త్రాగునీరు అందించే లక్ష్యమైన పథకంలో భాగంగా 39.60 లక్షల రూపాయలతో 60 వేల లీటర్ల సామర్జ్యంతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ (వాటర్ ట్యాంక్) నిర్మాణానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ తో విచ్చేసి శుక్రవారం శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి త్రాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల డిసి అధ్యక్షులు మెర్ల గోపాలస్వామి, సర్పంచ్ దూలం వెంకటలక్ష్మి సత్తిబాబు, ఎంపీటీసీ సభ్యులు పడాల నాగలక్ష్మి అమ్మిరాజు, జనసేన మండల అధ్యక్షుడు సూరపురెడ్డి సత్య, టిడిపి సీనియర్ నేతలు పాలూరి గోవిందరాజు, ఈదల నల్లబాబు, ఒంటిపల్లి సతీష్, ఎంపీడీవో ఏ.రాజు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పి.పద్మ, ఏపీవో అరుణకుమారి, కార్యదర్శి విజయ రెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.