ప్రజాశక్తి- రాయచోటి జిల్లాలోని రైతులందరికీ అందుబాటులో ఉండి భూ సమస్యల పరిష్కారమే లక్ష్యమని జిల్లా భూ రికార్డులు, సర్వే శాఖ సహాయ సంచాలకులు టి. జయ రాజ్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాల్లో రైతులకు భూ సమస్యలు ఎలా పరిష్కరించాలో, భూ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో, రీ సర్వే ఎంత చేశారో, తదితర అంశాలపై ప్రజాశక్తికి ఇచ్చిన ముఖా ముఖిలో ఆయన వివరించారు.అన్నమయ్య జిల్లాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ? అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 30 మండ లాలున్నాయి. రెవెన్యూ గ్రామాలు 470 ఉన్నాయి. మండల సర్వేయర్లు 30 మంది, విలేజ్ సర్వేర్లు 389 మంది ఉన్నారు.జిల్లా వ్యాప్తంగా భూమి విస్తీర్ణం ఎంత ? జిల్లా వ్యాప్తంగా మొత్తం భూమి విస్తీర్ణం 15,32,821.ఎకరాల 11 సెంట్లు ఉంది. ‘భూ రీ సర్వే 2019వ సంవ త్సరంలో ప్రారంభించాం. 2,73,674. ఎకరాల 02 సెంట్లు రీ సర్వే చేశాం.భూ సమస్యల పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ? సాధారణంగా భూ సమస్యలు ఎక్కువగా అన్నదమ్ములు మధ్య, సాగులో ఒకరు ఉంటే పట్టా పాసుపుస్తకంలో మరొకరి పేరు ఉండడం వంటి సమస్యలు ఉంటాయి. కొందరు సరిహద్దులు సమస్యలతో వస్తూ ఉంటారు. గ్రామ, మండల స్థాయిలో సర్వేర్లు ఉంటారు. అక్కడ న్యాయం జరగకపోతే ఆర్‌డిఒ కార్యాలయంలో ఫిర్యాదు చేసుకోవచ్చు. అక్కడ కూడా బాధితునికి న్యా యం జరగలేదని భావిస్తే జిల్లా స్థాయిలో తమ దగ్గర వస్తే, జిల్లా స్థాయి సర్వేలు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు న్యాయం చేస్తాం.సర్వే చేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనా? యజమాని భూమిని కొనాలన్నా, స్ధలం చూపించాలన్నా అర్జీ పెట్టుకోవాలి. ప్రభుత్వానికి నేరుగా డిడి, చలానా రూపంలో భూమి కొలతల మేర చలానా చెల్లించాలి. ఇది మినహా సర్వేయర్ అదనంగా ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా డబ్బులు అడిగినట్లు తమ దష్టికి తీసుకొస్తే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటాం.సిబ్బంది కొరత సమస్య ఏమైనా ఉందా? గతంలో భూ రికార్డుల సర్వే శాఖలు సిబ్బంది కొరత ఉండేది. ప్రస్తుతం ప్రతి సచివాలయానికి ఒక సర్వేయర్, మండలానికి మరో సర్వేయర్ ఉన్నారు. ఆర్జీలు వచ్చిన వెంటనే ఆ గ్రామ సచివాలయ సర్వేర్ కొలతలు వేస్తున్నారు. సిబ్బంది కొరతతో ఎలాంటి సమస్య లేదు.ప్రజలకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమిటి ? ప్రజలు వీలైనంతవరకు చిన్న చిన్న భూ సమస్యలు అక్కడ ఉన్న పెద్ద మనుషులతోనే పరిష్కరించుకోవాలి. దీనివల్ల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. తప్పని పరిస్థితిలో మాత్రమే సర్వేర్లను కలవాలి. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే తమ కార్యాలయంలో రైతులు కలిసి సమస్యలు పరిష్కరించుకోవచ్చును.
