జిల్లాలో వైసిపి బిసి విభాగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం : బీసీ సెల్‌ జిల్లా నూతన అధ్యక్షులు ఉజ్జయిని సాంబశివ

ప్రజాశక్తి – బి.కొత్తకోట (అన్నమయ్య) : జిల్లాలో వైసిపి బిసి విభాగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని ఆపార్టీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షులు ఉజ్జయిని సాంబశివ స్పష్టం చేశారు.అన్నమయ్య జిల్లా వైఎస్‌ఆర్సిపి బీసీ సెల్‌ కమిటీ నియమాకాల్లో భాగంగా జిల్లా అధ్యక్షుడిగా తనను నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశాడు.ఇందులో భాగంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి,మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి,పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మరియు మదనపల్లి వైఎస్‌ఆర్సిపి ఇంచార్జ్‌ నిషార్‌ అహ్మద్‌ జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షులు ఉజ్జయిని సాంబశివ మర్యాదపూర్వకంగా కలిసి కఅతజ్ఞతలు తెలిపారు.వైకాపా ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని,అనేక నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చారని కొనియాడారు.వైకాపాతోని బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. 2029లో వైఎస్‌ఆర్సిపి విజయం కోసం బీసీలను సన్నద్ధం చేసి,మరోసారి జగన్మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వైస్‌ ఎంపీపీ ఖాదర్‌ వలీ, సర్పంచ్‌ శ్రీనివాసులు, సర్పంచ్‌ నాగరత్న, ఈశ్వర్‌, సర్పంచ్‌ జి.శ్రీనివాసులు, వైఎస్‌ఆర్సిపి నాయకులు సుబ్బారెడ్డి, జేసిఎస్‌ మండల కన్వీనర్లు నేరెళ్ల రెడ్డి హరి, ఆర్‌.సి.ఈశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️