ప్రజాశక్తి-కడప కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ప్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కడప జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని రవీంద్రనగర్ యుఎస్ మహల్ ఫంక్షన్ హల్ నుంచి ఏడు రోడ్ల సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. కేంద్ర, రాష్ట్ర కూటమి పార్టీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా చేసిన జెఎసి నాయకులు మాట్లాడుతూ వక్ప్ బోర్డు చట్టం రద్దు చేసేంత వరకు పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన చేస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో ఉండే ప్రజలను హిందూ, ముస్లిం అంటూ బిజెపి గొడవలు, అల్లర్లు సష్టిస్తుందని పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ చట్టం 2024 రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా మరింత నిరసన కార్యక్రమాలు చేపడతామని బిజెపిని, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు బాబు భారు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అఫ్జల్‌ఖాన్, ముఫ్తీ రహిముల్లా ఖాన్‌సాహెబ్, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, సిపిఐ నాయకులు చంద్ర, భాస్కర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అలీఖాన్, కాంగ్రెస్ పార్టీ నగర్ ఉపాధ్యక్షులు హమీద్, కాంగ్రెస్ నాయకుల గౌస్ పీరు, మౌలానా జాకీర్ సాహెబ్, ఎస్‌డిపిఐ నాయకులు, ఇతర పార్టీ నాయకులు, కడప నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
