ప్రజాశక్తి-కడప అర్బన్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఎపిజిబి) ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని రాయలసీమ అభివద్ధి వేదిక కన్వీనర్ డాక్టర్ సి.ఓబుల్‌రెడ్డి, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా డిమాండ్ చేశారు. శుక్రవారం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అతి పెద్దదైన ఎపిజిబిలో మిగిలిన గ్రామీణ బ్యాంకులు విలీనం అవుతున్న నేపథ్యంలో ఇక్కడి ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడే కొనసాగించాలని అమరావతికి తరలించాలానే ప్రయత్నం విరామించుకోవాలని చెప్పారు. ఇది పాలకవర్గ పార్టీలకు రాయలసీమ పట్ల వున్న వివక్షకు నిదర్శనమని తెలిపారు. రాయలసీమ ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఎపిజిబి ప్రధాన కార్యాలయాన్ని విలీనం తర్వాత కూడా కడపలోనే కొనసాగిం చాలని కోరుకుంటు న్నారని పేర్కొన్నారు. వ్యాపారంలో, లాభాల్లో, మౌలిక సదుపాయాలు కలిగి ఉండడంలో, సాంకేతికత, కరెన్సీ చెస్ట్ ఇలా అన్నింటా ఎపిజిబి దేశంలోనే అగ్రసా ్థనంలో ఉందన్నారు. అలాంటి బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించడమంటే వెనకబడిన ప్రాంతాల పట్ల కక్ష పూరిత వైఖరి ప్రదర్శించ డమేనన్నారు. ఇప్పటికే లోకాయుక్త, ఎంఎస్‌ఎంఇ ట్రైనింగ్ సెంటర్‌ను, న్యాయ విశ్వవిద్యాలయాన్ని, హైకోర్టును, నార్కోటిక్స్ కోర్టులను రాయలసీమకు లేకుండా చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, సాంప్రదాయం ప్రకా రం కడపలోనే ఎపిజిబి హెడ్ క్వార్టర్‌ను కొనసాగించాలని తెలిపారు. లేనిపక్షంలో రాజకీయాలకతీతంగా అన్ని పక్షాలను, ప్రజాసంఘాలను, మధ్యతరగతి ఉద్యో గులు, ఉపాధ్యాయులను, ప్రజలను, బ్యాంకు అకౌంట్ హౌల్డర్స్‌ను సమీక రించి పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో అభివద్ధి వేదిక నాయకులు ఇ.ప్రవీన్, లోహిత్ మనోజ్, రవి పాల్గొన్నారు.
