అడ్డంగా ఆక్రమించుకున్న బస్టాండ్‌ – మార్కెట్‌ వ్యాపారులకు అధికారులు దాసోహం

ప్రజాశక్తి-హిందూపురం (అనంతపురం) : పురపాలక సంఘంలోని సొంత స్థలంలో మున్సిపల్‌ శాఖ అనుమతి లేకుండా చిన్నపాటి ఇల్లు కడుతుంటే…. వెంటనే సచివాలయ సిబ్బంది అక్కడికి చేరుకుని… పనులను అడ్డుకోవడంతోపాటు వారికి నోటీసులు ఇస్తారు…. అలాంటిది హిందూపురం పురపాలక సంఘ ఆధీనంలో ఉన్న ప్రైవేటు బస్టాండ్‌ ను కూరగాయల టోకు వ్యాపారులు అడ్డంగా ఆక్రమించుకుని, ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్ల నిర్మాణాలు చేసుకున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు… అందినంత మామూళ్లు దోచుకుని వారికి ప్రత్యక్షంగా సహకరిస్తు కూరగాయల వ్యాపారులకు దాసోహం అయ్యారు. దీనివల్ల ఆ మార్గంలో వెళ్లడానికి ఇబ్బందిపడుతున్నామని ప్రయాణీకులు వాపోతున్నారు.

➡️