ప్రజాశక్తి-మద్దిపాడు : ముక్కోటి ఏకాదశి సందర్భంగా మండల పరిధిలోని మల్లవరం గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వ హించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ నాయకులు భక్తుల కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతిశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడక స్వాములు, మండల అధ్యక్షులు మండవ జయంత్ బాబు, మార్నెని రాఘవ, వరాల చౌదరి, మార్నెని కృష్ణారావు, ఎమ్మార్వో సుజన్ కుమార్, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.