ఉత్తమ ప్రదర్శనగా ఉక్కునగర ‘అ-సత్యం’ నాటిక

Apr 15,2025 23:56

ఉత్తమ ప్రదర్శనగా నిలిచిన ఆ-సత్యం నాటికలో సన్నివేశం
ప్రజాశక్తి – యడ్లపాడు :
మండలంలోని లింగారావుపాలెం గ్రామంలో మూడ్రోజులపాటు జరిగిన జాతీయస్థాయి నాటిక పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. మొత్తం 9 నాటికలు ప్రదర్శించగా వీటిలో ఉత్తమ నాటికలు, వ్యక్తిగత అవార్డులను పరిషత్‌ నిర్వాహకులు ప్రకటించగా బహుమతుల్ని విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య ప్రదానం చేశారు.పిన్నమనేని మృత్యుంజయరావు రచించిచగా పి.బాలాజినాయక్‌ దర్శకత్వంలో ఉక్కునగరమైన విశాఖపట్నంలోని చెతన్య కళాస్రవంతి ప్రదర్శించిన ‘అ-సత్యం’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా టి.మాధవ్‌ రచించిన, ఆర్‌.వాసుదేవరావు దర్శకత్వం వహించిన యంగ్‌ థియేటర్‌ ఆర్గనైజేషన్‌ (విజయవాడ) వారి ’27వ మైలురాయి’, తృతీయ ప్రదర్శనగా పిటి మాధవ్‌ రచించిన గోపరాజు విజరు దర్శకత్వం వహించిన శ్రీ సాయి ఆర్ట్స్‌ (కొలకలూరు) వారి ‘జనరల్‌ బోగీలు’ ఎంపికైంది. సునయన నిర్వహణలో అక్కల తామేశ్వరయ్య రచించి, వడ్డాది సత్యనారాయణ దర్శకత్వం వహించిన యువభేరి థియేటర్స్‌ (హైదరాబాద్‌) వారి ‘నాశత్రువు’ నాటిక ప్రత్యేక జ్యూరీ అవార్డు కైవసం చేసుకుంది.వ్యక్తిగత ప్రతిభల విభాగంలో… ఉత్తమ దర్శకుడిగా ‘అ-సత్యం’ నాటికకు బాలాజీ నాయక్‌, ఉత్తమ రచనగా ’27వ మైలురాయి’కు పీటీ మాధవ్‌, ఉత్తమ నటుడిగా ’27వ మైలురాయి’ నాటికలో పవన్‌, ఉత్తమ నటిగా అదే నాటికలో సురభి ప్రభావతి, ఉత్తమ సహాయ నటుడు ‘జనరల్‌ బోగీలు’లో కె.నాగేశ్వరరావు, ఉత్తమ సహాయ నటిగా ‘కిడ్నాప్‌’లో అమృత వర్షిణి, ఉత్తమ విలన్‌గా ‘జనరల్‌ బోగీలు’లో గోపరాజు విజరు, ఉత్తమ హాస్యనటుడుగా ‘నా శత్రువు’లో జ్యోతిరాణి, ఉత్తమ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ‘చిగురుమేఘం’లో కావూరు సత్యనారాయణ, ఉత్తమ బాలనటుడుగా ‘కిడ్నాప్‌’లో లోకేష్‌, ఉత్తమ బాలనటిగా ‘నా శత్రువు’లో యష్విక్‌, ఉత్తమ రంగాలంకరణ ‘అ-సత్యం’కు ఎం.సత్తిబాబు, ఉత్తమ ఆహార్యం ‘నా శత్రువు’ నాటిక, ఉత్తమ సంగీతం ’27వ మైలురాయి’కు లీలామోహన్‌ దక్కించుకున్నారు.జ్యూరీ అవార్డుల విభాగంలో… ‘విడాకులు కావాలి’ నాటికలో జి.వసంతయామిని, ‘జనరల్‌ బోగీలు’కి పి.విజరు, ‘కిడ్నాప్‌’లో ఎస్‌.పూజిత బహుమతులు పొందారు. కార్యక్రమంలో అ్యధ్యక్షులు కట్టా శ్రీహరిరావు, ఉప్యాధ్యక్షులు తోకల సాంబశివరావు, నంబూరు వీరాంజనేయులు, కార్యదర్శి మండెపూడి శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు మల్నేని సీతారామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, కోశాధికారులు కట్టా వీరాంజనేయులు, నంబూరు శివరామకృష్ణ, నంబూరు ఉల్లయ్య, జరుగుల రామారావు ఉన్నారు.

➡️