ప్రజాశక్తి -చీమకుర్తి : కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత, పారిశ్రామికవేత్త శిద్దా హనుమంతరావు పుష్పలత దంపతుల షష్టిపూర్తి వేడుకలు మంగళవారంతో ముగిశాయి. గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని శిద్దా హనుమంతరావు దంపతులను ఆశీర్వాదించారు. శిద్దా దంపతులను ఆశ్వీరదించిన వారిలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు దంపతులు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్. విజరు కుమార్, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దంపతులు, రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ శిద్దా సుధీర్ దంపతులు, మన్యం సునీత, రాజశేఖర్ అర్చన దంపతులు, నల్లూరి ఫౌండేషన్ అధినేత నల్లూరి వెంకట శేషయ్య, పారిశ్రామికవేత్తలు బంగారు రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, కంది రవిశంకర్, చలువాది బదరీ నారాయణ, డాక్టర్ జవహర్, హరి ప్రసాద్, రామచంద్రా రెడ్డి, శిద్దా వెంకటేశ్వరరావు దంపతులు, శిద్దా సూర్య ప్రకాష్ రావు దంపతులు, శిద్దా భరత్ దంపతులు, ఉదరు దంపతులు, మురళీమోహన్‌రావు, కమలాకర్, ప్రకాష్ ఆర్ట్స్ అధినేత సుబ్బారావు, ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్తు శేఖర్, బాలాజీ రావు, భాస్కర్ రెడ్డి, ఉపాస్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రకాష్, గుప్తా కన్స్ట్రక్షన్స్ అధినేత వీరబాబు, రైస్ కళాశాల గౌరవ చైర్మన్ రంగమన్నార్ ఉన్నారు.
