రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి  మృతదేహం లభ్యం

Jan 7,2025 15:58 #Kurnool, #road accident

ప్రజాశక్తి – కర్నూలు క్రైమ్ : ఈనెల 5వ తేదీ సాయంత్రము సుమారు 7.15 గంటలకు ఒక గుర్తుతెలియని మగ మనిషి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు.  సుమారు 40-45 సంవత్సరాలు వయస్సు కలిగిన వ్యక్తి కుర్నూల్ సిటీ రైల్వే స్టేషన్- దుపాడు రైల్వే స్టేషన్ ల మద్య దేవనగర్, విటల్ నగర్ లకు దగ్గరలో KMNo. 245/1 ఎలక్ట్రికల్ పోల్ వద్ద రైలు డీ కొట్టుట వలన మృతి చెందినట్లు కర్నూలు రైల్వే పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ టి.సి.మాధవస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మృతుడి నుదుటి వద్ద కుడి కన్ను పై భాగము నుండి, ఎడమకన్ను వరకు తల బాగము చీలి, కాళ్లు చేతులు విరిగినట్లు కనిపిస్తోంది. కర్నూలు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కె. లక్ష్మన్న తనకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతున్ని గుర్తుపట్టుటకు ఆనవాళ్లకు సంబంధించి నీలము రంగు ఫుల్ హ్యాండ్స్ షర్టు పైన తెలుపు, మెరున్ రెడ్ నిలువు-అడ్డము గీతలు గళ్ళు కలిగి, నలుపురంగు ప్యాంటు ధరించాడన్నారు. ఒక ఇంచు పొడవుగల ఇంచు పొడవు తల వెంట్రుకలు, కుడి చేయి మనికట్టుకు ఒక ఎరుపు రంగు దారము, ఒక పసుపురగు దారం కట్టి ఉందన్నారు. కుడి చేతిపైన “అమ్మ” అను అక్షరములు, ఎడమ చేతిపైన “వెంకీ” అను అక్షరములు వుండి  లవ్ సింబల్ ఉంది.  5.”3″ ఇంచులు ఎత్తు, చామనచాయ వర్ణం కలిగి ఉన్నాడన్నారు. మృతుని షర్టు జేబులో హిందుస్థాన్, విశాల్ పాన్ మసాలా పాకెట్లు లభించినట్లు తెలిపారు. మృతునికి సంబదించిన వివరాలు తెలిసిన వారు కుర్నూలు రైల్వే పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ టి.సి.మాధవ స్వామి ఫోన్ నెంబర్ 9441802327కు గాని, కుర్నూలు రైల్వే పోలీస్ ఇంచార్జీ ఎస్ఐ సి.బిందుమాధవి ఫోన్ నెంబర్ 9030481295కు గాని తెలియజేయాలని కోరారు.

➡️