బాలుడు అదృశ్యం-బావిలో విగతజీవిగా కనిపించాడు

Feb 13,2024 12:53 #boy death, #chittore, #well

ప్రజాశక్తి-సోమల (చిత్తూరు) : గత 3 రోజులుగా కనిపించకుండాపోయిన ప్రతిభావంతుడైన బాలుడు మంగళవారం ఉదయం వ్యవసాయ బావిలో విగతజీవిగా కనిపించిన ఘటన మంగళవారం సోమల మండలంలో జరిగింది. సోమల మండలం అన్నెమ్మగారిపల్లి పంచాయితీ ఎర్రగుంతలవారిపల్లె గ్రామానికి చెందిన రుషికేశవ అనే బాలుడు గత మూడు రోజులుగా అదృశ్యమయ్యాడు. బాలుడి మేనమామ ప్రత్యేక ప్రతిభావంతుడైన తన అక్క కొడుకు కనిపించడం లేదంటూ సోమల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గ్రామానికి సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో రుషికేశవ విగతజీవిగా కనిపించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️