బస్సును ఢకొీన్న టిప్పర్‌

ప్రజాశక్తి-కారంచేడు కారంచేడు కృష్ణ కాలువ బ్రిడ్జిపైన శనివారం ఆర్టీసీ బస్సును ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో మట్టి టిప్పర్‌ ఢకొీంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని స్వర్ణ నుంచి చీరాల వస్తున్న ఆర్టీసీ బస్సు కారంచేడు కృష్ణ కాలువ మీదుగా ఎక్కే క్రమంలో పర్చూరు నుంచి చీరాలకు అతివేగంగా వస్తున్న బస్సుని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో రెండు ఢకొీన్నాయి. దీంతో లోపల బస్సులో ఉన్న సుమారు 30 మంది ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతివేగంగా వస్తున్న టిప్పర్‌ ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ సంఘటనతో పర్చూరు, చీరాల మధ్యలో భారీ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న కారంచేడు ఎస్‌ఐ వెంకట్రావు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.ప్రమాద సూచికలు ఏవి..? కారంచేడు కృష్ణ కాలువ బ్రిడ్జి పక్కన ఒకవైపు స్వర్ణ మరొకవైపు కుంకులమర్రు గ్రామాలకు వెళ్లడానికి రహదారి మలుపు తిరిగి ఉంటుంది. అయితే ఈ మలుపుల్లో ప్రమా ద సూచికలు ఎక్కడ కూడా కనిపించవు. గతంలో కొన్ని రహదారులపై అద్దాలతో కూడిన ప్రమాద సూచికలు ఏర్పా టు చేశారు. అయితే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో మాత్రం ప్రమాద సూచికలు లేకపోవడం వలన ఒక వైపు నుంచి వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా సం బంధిత అధికారులు రోడ్ల మలుపులో ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి ఇలాంటి ప్రమాదాలు మరొకసారి జరగ కుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

➡️