సిసి రోడ్లను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. సోమవారం మండలంలోని చిట్టవరం గ్రామంలో 44 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రహదారులను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు ప్రారంభించారు. 36.60 లక్షల నిధులతో మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క రాధాకృష్ణ, ఎంపీపీ మైలబత్తుల సోని, ఎంపీటీసీ నక్కా లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

➡️