ప్రజాశక్తి-మోపిదేవి (కృష్ణా) : పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ గ్రామాలలో చెత్త సేకరణలో ఆయా పంచాయతీ పాలకవర్గాలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి ఈ మేరకు ప్రజలను కూడా చైతన్యం చేస్తున్నాయి గఅహాల నుంచి ఇచ్చే వ్యర్ధాలలో తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇమ్మని మరీ చెబుతున్నారు ఈ క్రమంలో శుక్రవారం మోపిదేవి మండలం పెదప్రోలు శివారు కాసానగరంలో చెత్త సేకరణ బండి ఇంటి ముందుకు వచ్చినప్పుడు తల్లి పొడి చెత్త చిట్టి కూతురు తడి చెత్త వేరువేరుగా తీసుకొచ్చి బండికి ఇస్తుండటం చూస్తే స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కల సా కారమైనట్లే కనిపిస్తోంది గ్రామపంచాయతీ సర్పంచ్ పొ లిమెట్ల ఏసుబాబు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో పారిశుధ్య సిబ్బంది చెత్త సేకరించే వాహనాలు షెడ్యూల్ ప్రకారం ఆయా నిర్దేశిత ప్రాంతాలకు వెళుతున్నాయా లేదా అని ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నారు చిన్నారుల సైతం చెత్తను భద్రంగా పంచాయతీ బండికి అప్పజెప్పాలి వీధుల వెంట పారేయకూడదు అనే జ్ఞానాన్ని తెలుసుకోవడం పలువురికి ఆదర్శం కావాలని ఆశిద్దాం
