క్లస్టర్‌ విధానంపై స్పష్టత ఇవ్వాలి

Mar 9,2025 21:00

ఒక సచివాలయానికి ఒక విఆర్‌ఒ ఉండాలి

ఎపి గ్రామ విఅర్‌ఒల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రేషనలైజేషన్‌లో క్లస్టర్‌ విధానం వల్ల రెండు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్‌ చేసి ఒక విఆర్‌ఒను నియమించడంతో ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు 7500 మంది కేడర్‌ స్ట్రెంత్‌ తగ్గిపోతుందని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.అప్పలనాయుడు, వి.శ్రీనివాసరావు అన్నారు. ఒక సచివాలయానికి ఒక విఆర్‌ఒ ఉండేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక ఎన్‌జిఒ హోమ్‌లో జరిగిన జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం విస్తృత సమావేశంలో వారు మాట్లాడారు.రేషనలైజేషన్‌తో మిగలిపోయిన 7500 మంది విఆర్‌ఒలను ఏం చేస్తారని ప్రశ్నించారు. అర్హులైన విఆర్‌ఎలకు ప్రమోషన్లు కల్పించి కేడర్‌ స్ట్రెంత్‌ తగ్గకుండా చూడాలని కోరారు. డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన మాట ప్రకారం సిపిఎస్‌, జిపిఎస్‌పై వెంటనే శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

➡️