ప్రజాశక్తి – బాపట్ల జిల్లా : బాపట్ల జిల్లా అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. ప్రగతి నివేదికల తయారీపై అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ అనుబంధ మరియు పారిశ్రామిక రంగంలో అభివద్ధి చెందే దిశగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. జిల్లాలో పర్యాటక రంగానికి అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. 103 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, దానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో మత్స్య, ఆక్వా సంపదకు అన్ని వనరులు ఉన్నాయన్నారు. పరిశ్రమలు స్థాపించడానికి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. జిల్లాలోని కష్ణానది పరివాహక ప్రాంతంలో వరదలు రాకుండా కరకట్లల అభివద్ధికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కష్ణ పశ్చిమ డెల్టా కాలుల మరమ్మతులకు చేపట్టడానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా సురక్షిత నీరు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకష్ణ, జిల్లా గ్రామీణ నీటి సరఫరాశాఖ ఎస్‌ఇ అనంతరాజు, గృహ నిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై. వెంకటేశ్వరరావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా అటవీశాఖ అధికారి భీమయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
