భారత రాజ్యాంగం విశిష్టమైనది

Apr 15,2025 17:01 #Vizianagaram

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మహాయోగని, ఋషని, ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఒక విశిష్టమైనదని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగలి పోతన్న అన్నారు. జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ కూడలి వద్ద గల అంబేద్కర్ భవనంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా రొంగలి పోతన్న మాట్లాడుతూ సమ, సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహానీయుడు అంబేద్కర్ ని కొనియాడారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన అంబేద్కర్ స్వతంత్ర భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా దేశానికి విశేషమైన సేవలు అందించారని తెలిపారు. జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు పి.షణ్ముఖరావు మాట్లాడుతూ భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు భారతదేశానికి విశిష్టమైన,వైవిధ్యమైన భారత రాజ్యాంగం అనే మహా గ్రంధాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పేందుకు లౌకికవాదాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచి ప్రపంచంలో భారత దేశాన్ని ఆదర్శంగా నిలిపారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి వేదిక ప్రతినిధులు బంగారు రాజు, ఈఎస్ఎన్ రాజు,బి.కూర్మారావు, ప్రముఖ న్యాయవాది నాలుగెస్సల రాజు, పప్పు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

➡️