భూ వివరాలపై కార్పొరేటర్‌ ఆరా

May 27,2024 21:56
భూ వివరాలపై కార్పొరేటర్‌ ఆరా

 ప్రజాశక్తి-భోగాపురం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి డి-పట్టా భూములను బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్‌ పీతల గురుమూర్తి యాదవ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రధానంగా అంతర్జాతీయ విమనాశ్రయం చుట్టూ భూముల కొనుగోలు చేసినట్లు సిఎస్‌పై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మండలంలోని కంచేరు రెవెన్యూ పరిధిలోని డి-పట్టా భూములు కూడా ఉన్నట్లు మూర్తి ఆరోపించారు. ఈ నేపథ్యంలో పీతల గురుమూర్తి యాదవ్‌ సోమవారం స్థానిక తహశీల్దారు కార్యాలయానికి వచ్చి తహశీల్దారు శ్యామ్‌ ప్రసాద్‌తో మాట్లాడారు. అయితే భూములకు సంబంధించిన వివరాల కోసం సమాచార హక్కు చట్టం ద్వారా విజయనగరం ఆర్‌డిఒ కార్యాలయంలో దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వచ్చినట్లు తెలిసింది. అనంతరం ఆరోపణలు చేసిన భూములను కూడా పరిశీలించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆయనను నెల్లిమర్ల నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు కలిశారు. నియోజకవర్గం పరిధిలోని భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లో ఎక్కడెక్కడ బినామీలతో ఇలాంటి భూములు కొనుగోలు చేశారన్న విషయాలపై వీరు మాట్లాడుకున్నట్లు తెలిసింది. దీనిపై తాము కూడా ఇక్కడ పోరాటాలు చేస్తామని బంగా ర్రాజు చెప్పినట్లు తెలిసింది.

➡️