పంచాయతీ కార్మికులకు కోర్టు ఆర్డర్ అమలు చేయాలి

Apr 15,2025 16:09 #collector, #prakasam

ప్రజాశక్తి – చిత్తూరు : ఉమ్మడి జిల్లాలో పంచాయతీ కార్మికులకు టెండర్లు రద్దుచేసి కార్మికులుగా తీసుకోవాలని కోర్టు ఆదేశాలను అమలు చేయాలని జనవరిలో కలిసిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. హామీ అమలు కాకపోవడంతో కార్మికుల మళ్లీ కోర్టును ఆశ్రయించగా వెంటనే ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. మంగళవారం ఈ తీర్పు ప్రకారం అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కలవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ సాయంత్రమే డిపిఓ తో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామయ్య, చిత్తూరు జిల్లా పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మధు, తిరుపతి జిల్లా పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

➡️