కడప సిటీ : అట్లూరు క్రాస్ రోడ్డు నందు సిపిఎం పార్టీ కార్యాలయం నందు వక్ఫ్ బోర్డు సవరణ చట్టం – రాజ్యాంగబద్ధత సవాళ్లు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం 2025 ఏప్రిల్ 21సోమవారం ఉదయం 10 గంటలకు కడప నగరం నందు ప్రెస్ క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశం కు సంబంధించిన కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి ,చాంద్ భాష ,అట్లూరు మండల సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఇ ,రమణయ్య లు మాట్లాడుతూ … కేంద్రంలో ని బి జె పి,ఎన్ డి ఏ ప్రభుత్వాలు ఏప్రిల్ 5 తేదీన అర్ధరాత్రి వక్ఫ్ సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు ఈ చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు కొన్ని రాజకీయ పార్టీలు ముస్లిం పర్సనల్ లా బోర్డు మరియు ప్రజా సంఘాలు సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం సుప్రీంకోర్టు ఈ కేసును విచారించుటకు అంగీకారం తెలిపింది , భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని ప్రపంచానికి చాటిన ప్రజల మధ్య మతోన్మాదానికి ప్రజల మధ్య అలాల్,పేరుతో హిజాబ్ పేరుతో ఆహారం పేరుతో త్రిబుల్ తలాక్ పేరుతో ముస్లిం మైనార్టీలపై భౌతిక దాడులు చేస్తుంటే వాటిని ఖండించకుండా ప్రేక్షక పాత్ర పోషించడం సరైంది కాదన్నారు నరేంద్ర మోడీ ముస్లింలకు న్యాయం చేస్తానని మాయ మాటలు చెబుతున్నారు ఈ చట్టం ముస్లింలకు నష్టమే తప్ప లాభం లేదు భారతదేశంలో అతిపెద్ద భూములున్న సంస్థలు మూడు ఉన్నవి ఒకటి మిలటరీ భూములు రెండవది రైల్వే రంగం మూడవది వక్ఫ్ బోర్డు ఆస్తులు,పై ఆస్తులు మోడీ గారు కార్పొరేట్ సంస్థకు ఆదానికి ఎప్పుడో కట్టబెట్టారు ఇప్పుడు ముస్లింల ఆస్తి పైన నరేంద్ర మోడీ కన్ను పడింది ఈ ఆస్తులను 52 కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమైంది ముస్లింల పైన కపట ప్రేమ చూపిస్తున్నారు అని వారు అన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సభ అధ్యక్షులుగా జి ,చంద్రశేఖర్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఉంటారు ప్రధాన వక్తలుగా ఎన్,తులసి రెడ్డి ,మాజీ రాజ్యసభ సభ్యులు,ముఖ్య అతిథులుగా ఎస్, అబ్దుల్ సుభాన్ ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ,వక్తలుగా ఎండి విజయ జ్యోతి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,గాలి, చంద్ర సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి,ఎస్, గురప్ప,బి ఎస్ పి జిల్లా అధ్యక్షులు,డబ్ల్యూ రాము సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ,కే సుబ్బరాయుడు,ఆర్‌ఎస్పి జిల్లా కన్వీనర్,జె,జయవర్ధన్ ఫార్వర్డ్ బ్లాక్ కార్యదర్శి .బి ఓబయ్య సిపిఐ ఎంఎల్ లిపరేషన్ జిల్లా కార్యదర్శి ,బి శ్రీనివాసులు ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి, డి శ్రీకఅష్ణ లోక్ సత్తా జిల్లా అధ్యక్షులు,డి రామచంద్ర డీఎంకే జిల్లా అధ్యక్షులు,బీసీ రమణ ఏపీ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్, సి ఆర్ వి ప్రసాద్ హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి ,పి ఓబుళపతి ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు,పి పుల్లయ్య ఎరుకుల హక్కుల పోరాట సంఘం జిల్లా కార్యదర్శి ,ఏ రామాంజనేయులు ఏపీ దళిత మిత్ర సంఘం,మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గంటారు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి లౌకికవాదులు ప్రజాస్వామ్యవాదులు హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు ప్రతి ఒక్కరూ పాల్గని రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని చేయాలని పిలుపునిచ్చారు ,సిపిఎం నాయకులు స్వప్న ,లతమ్మ ,వెంకటసుబ్బయ్య ,ప్రశాంత్ బాబు,సునీల్ కుమార్ ,సుధాకర్ , తదితరులు పాల్గొన్నారు.
