అనంత కార్పొరేషన్‌ లో ప్రహసనంగా మారిన దినసరి సంత మార్కెట్‌ టెండర్‌

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో దినసరి సంత మార్కెట్‌ టెండర్‌ వేలంపాట అధికారుల వింత ధోరణితో ప్రహసనంగా మారింది దినసరి సంత మార్కెట్‌ సుంకం వసూలులో తలెత్తే సమస్యలను వేలంపాట టెండర్‌ లో పాల్గొన్న కాంట్రాక్టర్లు డిప్యూటీ కమిషనర్‌ మిటికేరి వెంకటేశులు ముందు ప్రస్తావించారు ఆ సమస్యలను కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని చెబుతూ వేలంపాట నిర్వహించాల్సింది పోయి ఈ సమస్యలు నాకు తెలియవు వాటిని పరిష్కరించే అధికారం కమిషనర్‌ కు మాత్రమే కలదు నేనేమీ చేయలేను మీరు చెప్పిన సమస్యలను కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా అంతవరకు దీనసరి సంత మార్కెట్‌ వేలంపాట టెండర్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు దినసరి సొంత మార్కెట్‌ వేలంపాట ప్రారంభానికి మునుపే స్థానిక అర్బన్‌ ఎమ్మెల్యే అనుచర వర్గం మరో ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్లు పాల్గొనేందుకు వచ్చారు అయితే టెండర్‌ లో వేలం పాట పాడే పాడేందుకు దరఖాస్తు చేసిన వారే ఉండాలని ఇతరులు బయటికి వెళ్లాలని గుమాస్తా నారాయణస్వామి మైక్‌ లో చెప్పారు అయితే కాంట్రాక్టర్లు ఆ మాటలను బేకాతర్‌ చేస్తూ కూర్చుండి పోయారు ఈ అంశంపై గట్టిగా చెప్పాలని డిప్యూటీ కమిషనర్‌ మిటికేరి వెంకటేశులు రెవెన్యూ ఆఫీసర్లు విజయ కుమార్‌ వెంకటేశులకు ఆదేశించారు అయితే వారు ఎటు చెప్పకుండా మిన్నకుండిపోయారు దీనితో అదేం పర్వాలేదు అంటూ ఎమ్మెల్యే అనుష వర్గం ఐదుగురు అలాగే కూర్చుండిపోయారు గడచిన మూడేళ్లుగా దినసరి సంత మార్కెట్‌ టెండర్ను వేలంపాటలో దక్కించుకున్న విజయ కుమార్‌ ఎప్పటిలాగే సమస్యలను ప్రస్తావించారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ప్రస్తావించటం వాటిని పరిష్కరించకకుండా ఉండటం జరుగుతుందని తెలిపారు టెండర్లో పాల్గనే కాంట్రాక్టర్కు సహాయకారిగా మరొకరు పాల్గొనటం పరిపాటిగా జరుగుతోందని తెలిపారు సమస్యలు పరిష్కరించిన తర్వాతే టెండర్‌ నిర్వహించాలని కాంట్రాక్టర్‌ విజయకుమార్‌ చెప్పటమే తరువాయి డిప్యూటీ కమిషనర్‌ వెంకటేశ్వర్లు వేలంపాట వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు అంతకుముందు నగరంలోని మటన్‌ మార్కెట్‌ వేలం పాటను సర్కారు సవాల్‌ 5 లక్షల పదివేల రూపాయలతో ప్రారంభించగా గడచిన రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా వేలంపాట పోటాపోటీగా సాగింది వేలం పాటలో కాంట్రాక్టర్లు హలీం సిద్దయ్య చంద్రశేఖర్‌ సుబ్బయ్య పాల్గొన్నారు. పోటాపోటీగా ధర పెంచడంతో అనుషంగా మటన్‌ మార్కెట్‌ వేలంపాట 680 వేల రూపాయలకు ధర పలికింది దీనితో కాంట్రాక్టర్‌ హలీం టెండర్‌ దక్కింది అయితే టెండర్‌ దక్కించుకున్న తర్వాత కాంట్రాక్టర్‌ హలీం డిప్యూటీ కమిషనర్‌ తో మా మాట్లాడుతూ మటన్‌ మార్కెట్‌ సుంకం వసూలు సమయంలో తనకు ఎవరితోనైనా బెదిరింపులు వస్తే వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు దీనిపై డిప్యూటీ కమిషనర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టెండర్‌ లో పాల్గొని మటన్‌ మార్కెట్‌ సుంకం వసూలు దక్కించుకున్న తర్వాత ధైర్యంగా ప్రత్యర్థులను ఎదుర్కోవాలని అందుకు భయపడరాదని భరోసా ఇచ్చారు

➡️