కూల్చిన అన్నదానం ఆశ్రమాలను యధావిధిగా నిర్మించాలి : సిపిఎం డిమాండ్‌

ప్రజాశక్తి-అట్లూరు (కడప) : కూల్చిన అన్నదాన ఆశ్రమం తిరిగి నిర్ణయించాలని శుక్రవారం అట్లూరు సిపిఎం పార్టీ కార్యాలయం నందు సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పీ,చాంద్‌ భాష ,అట్లూరు మండల సిపిఎం కార్యదర్శి ఇ,రమణయ్య మాట్లాడుతూ జ్యోతి క్షేత్రంలో ఉన్న కాశీనాయన అన్నదానం సత్రాలను అక్కడ ఉన్న కట్టడాలను కూల్చడం చాలా దుర్మార్గమైనదని సిపిఎం పార్టీ తరపున ఖండించడం జరిగింది ,అక్కడున్న కట్టడాలు కూల్చి లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు ,కాశి నాయన ఆశ్రమాలలో ప్రతిరోజు నిత్యం వేలాదిమంది భక్తులకు ,ప్రజలకు అన్నదానం చేస్తా ఉంటారు ,కట్టడాలను కూల్చిన అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు అన్నారు,రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ , కూల్చిన కట్టడాలను తన సొంత నిధులతో నిర్మిస్తానని హామీ ఇచ్చారు ఈ హామీ మాటలకు పరిమితం కాకుండా కట్టడాలు నిర్మించి హామీ నీ నిలబెట్టుకోవాలన్నారు,కాశీ నాయనకు కోట్లాదిమంది భక్తులున్నారు.1995 డిసెంబర్‌ 6 న 104 సంవత్సరాల వయసులో జ్యోతిక్షేత్రం లో ఆయన నిర్యాణం చెందారు.భక్తులు అక్కడ ఆయనకు సమాధి, గుడి కట్టించి అన్నదాన సత్రం,గోసాల ,మిగతా కట్టడాలు నిర్మించారు.నిత్యం వేలాది మంది అన్నార్థులకు అన్నదానం జరుగుతుంది.1999లో నరసాపురం కేంద్రంగాకాశినాయనమండలంఏర్పాటయింది.ప్రభుత్వ నిధులతో రోడ్డు,విద్యుత్‌ సరఫరా,త్రాగునీటి సరఫరా, టెలిఫోన్‌ టవర్‌ ఏర్పాటు చేయడమైనది.ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ వీళ్ళిద్దరూ ఢిల్లీలో ఉన్న అటవీ శాఖ కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ తో మాట్లాడి సమస్య పరిష్కారం చేసి కాశీనాయన ఆశ్రమాలకు భక్తులకు న్యాయం చేయాలని కోరారు లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తావని హెచ్చరించారు ,ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రవిచంద్ర ,అట్లూరు గోపయ్య , జి,గోపయ్య పాల్గొన్నారు.

➡️