కనీస వేతనం 26 వేలు అమలుకై కార్మికులు, రైతులు ధర్నా
…మోడీ కార్పొరేట్ అనుకూల విధానాలు నశించాలని నినాదాలు
…కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని కార్మికసంఘాల డిమాండ్
ప్రజాశక్తి కాకినాడ : పది కేంద్ర కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు సంయుక్తంగా ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద కార్మిక, రైతు సంఘాలు ధర్నా నిర్వహించి జాతీయ, స్థానిక డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్ఓ వెంకటరావు కి అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి.బేబీరాణి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తిరుమలశెట్టి నాగేశ్వరావు, అప్పారెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు, రైతు కూలీ సంఘం నాయకులు రాజబాబు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మోర్తా రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుముడి ఈశ్వరరావు, కార్యదర్శి పప్పు ఆదినారాయన, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఏసు మాట్లాడుతూ రైతుల పంటలకు గిట్టుబాటు ధర పెట్టుబడిపై 50 శాతం అదనంగా నిర్ణయించి చట్టం చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా జాతీయ కనీస వేతనాన్ని 26వేలుగా నిర్ణయించి అమలు చేయాలని, 60 ఏళ్లు పనిచేసి రిటైర్ అయిన వారికి 10 వేలు కనీస పెన్షన్ చెల్లించాలని, ఆటో, హమాలీ, ట్రాన్స్ పోర్ట్, భవన నిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే చట్టాలను అమలు చేయాలని, సస్కీం వర్కర్లయిన అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష ఉద్యోగులను, కార్మికులను రెగ్యులర్ చేయాలని, గ్రాడ్యుటీ, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ తక్షణం నిలుపుదల చేయాలని, ప్రజలపై విద్యుత్ భారాలు పెంచే 2023 విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, అత్యవసర మందులపై జిఎస్టి ఎత్తివేయాలని, ధరలు తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్ లను జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు మేరకు అమలు చేయాలని కోరారు. అదానీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు అన్నిటిని రద్దు చేయాలని. స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఏలేరు వరదల సందర్భంగా 122 చోట్ల గండ్లు ఏర్పడ్డాయని తక్షణం వాటిని పూడ్చాలని, ఈ వరదలలో మునిగిన పంటలకు ఇన్సూరెన్స్ ను తక్షణం చెల్లించాలని, ఉపాధి పథకాన్ని 200 రోజులకు పెంచి రోజు వేతనం 600 చెల్లించాలని, కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు, పంట రుణాలు, నష్టపరిహారాలు చెల్లించాలని, పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు రెగ్యులర్గా సేఫ్టీ ఆడిట్లు నిర్వహించాలని, మూసివేసిన పరిశ్రమలు తాండవ, డెక్కన్ చక్కెర పరిశ్రమలను, చిన్నింపేట ఇంటర్ స్నాక్ క్యాష్యు పరిశ్రమలను తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని, ఎన్నికల హామీ మేరకు వాలంటీర్లు అందరినీ కొనసాగించి, పదివేల వేతనం చెల్లించాలని, 33 రోజుల నుంచి సమ్మె చేస్తున్న కాకినాడ మున్సిపల్ క్లాప్ డ్రైవర్లకు మూడు నెలల వేతన బకాయిలు, తొమ్మిది నెలల పిఎఫ్ బకాయిలు చెల్లించి సమ్మెను పరిష్కరించాలని స్థానిక డిమాండ్లు రాష్ట్ర కూటమి ప్రభుత్భం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకా రమణ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు దడాల పద్మ, ఎరుబండి చంద్రావతి, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, కోశాధికారి నొక్కు లలిత, మధ్యాహ్న భోజన పథ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు సుబ్బలక్ష్మి, నర్ల ఈశ్వరి, కాకినాడ రూరల్ కమిటీ కన్వీనర్ టి రాజా, నైట్ వాచ్ మెన్ కార్మికుల సంఘం నాయకులు వీర్రాజు, నాగేశ్వరరావు, ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ బొబ్బిలి శ్రీనివాసరావు, జట్లు లేబర్ యూనియన్ రామకృష్ణ, సివిల్ హమాలిస్ వీరబాబు, సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ జి.రామ, పిఠాపురం ఏఐటీయూసీ నాయకులు శాఖ రామకృష్ణ, సామర్లకోట ఏఐటీయూసీ నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, ఏ.ఐ.ఎఫ్.టి.యు జిల్లా కన్వీనర్ అంజిబాబు ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గోపాల్ ఆదినారాయణ ఏఐసిసిటియు జిల్లా నాయకులు నరసరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాస్, మెడికల్ రిప్స్ సభ్యులు, శ్రీపాదం సత్తిబాబు, బొద్దు సత్యన్నారాయణ మూర్తి, నోవాహు, పంతాడి నాగేశ్వరరావు, ఎల్లారావు తదితరులు పాల్గొన్నారు.