ప్రజాశక్తి – కొల్లిపర : సంక్రాంతి సందర్భ ంగా కోడిపండేలు, ఇతర జూదాల నిర్వహణ కోసం చేసుకున్న ఏర్పాట్లను పోలీసులు నిలువరించారు. మండలంలోని బొమ్మవాని పాలెం పొలాల్లో కోడిపందాల బరులు, టెంట్లు, వేదికలు, టెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇది తెలిసిన ఎస్‌ఐ కోటేశ్వర రావు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ట్రాక్టర్‌ను తెప్పించి టెంట్లను పడవేయించడంతోపాటు ఇతర ఏర్పాట్లను నిలువరించారు. జూదాల నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు, జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.