ప్రజాశక్తి-యు.కొత్తపల్లి (కాకినాడ) : యువతి అదృశ్యమైన ఘటన మంగళవారం యు.కొత్తపల్లిలోని అమరవిల్లి గ్రామంలో జరిగింది. అమరవిల్లి గ్రామానికి చెందిన వాకా లలిత (25) అనే యువతి గత రెండు రోజుల నుండి కనబడటం లేదని తొండంగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బంధువులు తెలిపారు. తొండంగి మండలం జిఎం పేట గ్రామంలోని సచివాలయం లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్న లలితకు అదే గ్రామానికి చెందిన వ్యక్తితో లలిత తండ్రి వివాహం చేసేందుకు నిశ్చయించారు. ఈక్రమంలో వివాహానికి సంబంధించి మాటలు జరుగుతుందగా, ఉద్యోగానికి వెళుతున్నానని చెప్పి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదని కుటుంబీకులు తెలిపారు. దీనిపై తొండంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.
