శతర కవితా సంపుటి ఆవిష్కరణ

Mar 9,2025 22:03

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : చత్తీస్‌ఘడ్‌లో రాయపూర్‌ తెలుగు మహా సంఘం నిర్వహిస్తున్న తెలుగు మహాసభలో ఆదివారం ప్రముఖ కవి సిరికి స్వామినాయుడు రాసిన ‘శతర’ ఆదివాసీ కవితా సంపుటిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవి ఆకుల కళ్లతో మైదానాన్ని చూస్తే .. మైదానం ఆకలి కళ్లతో అడవిని చూస్తోందనీ.. శతర ఆదివాసీ అత్మగౌరవ పతాకమని అభివర్ణించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌, సినీనటుడు సాయికుమార్‌, గజల్‌ గాయకులు శ్రీనివాస్‌, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ పాల్గొన్నారు.

➡️