ప్రజలకూ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి : జిల్లా కలెక్టర్‌

Feb 4,2025 13:36 #District Collector, #people

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనలో భాగంగా తడి-పొడి చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది వేర్వేరుగా సేకరించాల్సిందేనని.. వేర్వేరు బిన్స్‌లో తడి-పొడి చెత్తను వేరుచేసి అందించే విషయంపై ప్రజలకు కూడా సచివాలయ స్థాయిలో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.మంగళవారం కలెక్టర్‌ డీకే బాలాజీ, మున్సిపల్‌ కమిషనర్‌ సిహెచ్‌ వివిఎస్‌ బాపిరాజు తో కలిసి మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 24వ డివిజన్‌ పాత రామన్నపేటలో పర్యటించారు. నగరంలో ఇంటింటికీ వెళ్లి మున్సిపల్‌ సిబ్బంది తడి- పొడి చెత్తను సేకరిస్తున్న తీరును స్వయంగా పరిశీలించారు. కొన్నిచోట్ల తడి పొడి చెత్తను ఒకే డస్ట్‌ బిన్‌లో వేయడాన్ని చూసి మున్సిపల్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలకూ చెత్తను వేరుచేసి అందించే విషయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ మునిసిపల్‌ సిబ్బంది గఅహాల నుంచి తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, వ్యర్థాల నిర్వహణ విషయంలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. వార్డు సచివాలయం యూనిట్‌గా సిబ్బంది.. ప్రజలకు చెత్త నిర్వహణపై అవగాహన కల్పించాలని, మనిషి ఆరోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు వీలుకల్పించే స్వచ్ఛత ప్రాధాన్యాన్ని తెలియజెప్పాలని ఆదేశించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా చేసిన ఏర్పాట్లు కూడా మంచి ఫలితాలిస్తున్నాయని.. ఇదేవిధమైన పర్యవేక్షణను మున్ముందు కూడా కొనసాగించాలన్నారు. హాట్‌స్పాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పర్యవేక్షణ వ్యవస్థను పరిశీలించి కలెక్టర్‌ బాలాజీ సంతఅప్తి వ్యక్తం చేశారు. 45వ డివిజన్‌ సబ్‌జైల్‌ వెనుకభాగంలో వర్షాకాలంలో డ్రెయిన్‌ ముంపునకు గురవుతున్న నేపథ్యంలో డ్రెయిన్‌ అభివఅద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని మునిసిపల్‌ అధికారులకు కలెక్టర్‌ సూచించారు.

➡️