మట్టి లారీ బోల్తా.. డ్రైవర్‌ మృతి

Apr 21,2024 18:01 #Konaseema

ప్రజాశక్తి – ఆలమూరు:ఒక మట్టి లారీ ప్రమాదవశాస్తూ అదుపుతప్పి బోల్తాపడగా డ్రైవర్‌ మఅతి చెందిన ఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై ఎల్‌.శ్రీను నాయక్‌ తెలిపిన వివరాలు ప్రకారం కొత్తపేట మండలంలోని ముద్దులమెరకకు చెందిన చుట్టుకోళ్ల పెద్దిరెడ్డి రాజు(32) ఐదేళ్లుగా రావులపాలెంకు చెందిన రంగారెడ్డి అనే ఓనర్‌ కు సంబంధించిన లారీ ట్రాన్స్పోర్ట్‌ లో లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున మట్టి లోడు లారీతో మండలంలోని చొప్పెల్ల జాతీయ రహదారి ప్రక్కనగల ఇటుక బట్టి వద్దకు వచ్చి అక్కడ రాజు మట్టిని అన్లోడింగ్‌ చేస్తున్నాడు. ఈ కోవలో లారీ అదుపుతప్పి ప్రక్కనున్న గోతులోనికి తలకిందులుగా పల్టీ కొట్టి పడిపోయింది. దీంతో రాజుకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు హుటాహుటిన ఆలమూరు సిహెచ్సికి తరలించారు. అక్కడ రాజు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మఅతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీను నాయక్‌ తెలిపారు.

➡️