అమృత్‌ 2.0 స్కీమ్‌కు గ్రహణం

ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లాలో అమృత్‌ 2.0 స్కీమ్‌ అమలుకు గ్రహణం పట్టింది. 2024 డిసెంబర్‌లో పిలిచిన టెండర్లను కూటమి సర్కారు హోల్డ్‌లో పెట్టింది. ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు భాగస్వామ్యంతో నిర్మించాల్సిన అమృత్‌ 2.0 తాగునీటి సరఫరా పథకం అమలుకు నోచుకోవడం లేదు. రూ.462 కోట్ల నిధుల్లో కేంద్రం వాటా కింద రూ.151 కోట్లు, రాష్ట్ర వాటా కింద రూ.255 కోట్లు, కార్పొరేషన్‌ వాటా కింద రూ.13.68, 15 ఫైనాన్స్‌ నిధుల నుంచి మరో రూ.33.12 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. 2024 మార్చి మూడున నిర్వహించిన టెండర్‌ నిర్వహించింది. అరబిందో, బిఆర్‌ సిసిఎల్‌ జాయింట్‌ వెంచర్‌ కంపెనీ కాంట్రాక్టును దక్కించుకున్నాయి. 2024 మార్చి నుంచి 2026 మార్చి లోపు పనులు పూర్తి చేయాలని గడువును నిర్దేశిం చింది. అమృత్‌ 2.0 ఫేజ్‌-1 పనుల్లో భాగంగా బ్రహ్మసాగర్‌ రిజర్వాయర్‌ ఇన్‌టెక్‌ వేల్‌లో వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ నిర్మించాల్సి ఉంది. దీనికి 45 కిలో మీటర్ల పరిధిలో ట్రీట్మెంట్‌ సంప్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. అక్కడి నుంచి ఎలెy ేటెడ్‌ లెవెల్‌ సర్జ్‌ రిజర్వాయర్‌ (యుఎల్‌ఎస్‌ఆర్‌) ద్వారా కడప నగరానికి సమీ పంలోని బండికనుమకు 9.5 మిలియన్‌ ఎంఎల్‌డి శుద్ధ జలాన్ని సరఫరా చేయ నుంది. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పైప్‌లైన్ల ద్వారా నగరానికి సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. కాంట్రాక్టు వెంచర్‌ కంపెనీ అమృత్‌ 2.0 ఫేజ్‌-1 సంబంధించి సర్వే పనులను సైతం పూర్తి చేసింది. బండికనుమ దగ్గర 13 ఎకరాల స్థలం, బ్రహ్మసాగర్‌ దగ్గర అప్రోచ్‌ రోడ్డు సహా తొమ్మిది ఎకరాల స్థలం రెవెన్యూ యంత్రాంగం కేటాయించాలి. బ్రహ్మసాగర్‌ ఇన్‌టెక్‌ వాల్‌ నిర్మాణ పనులకు 45 కి.మీ మేర జిల్లా నీటిపారుదల శాఖ, ఎన్‌హెచ్‌ డిపార్టుమెంట్‌లు అనుమతులు ఇవ్వాల్సి ఉంది. మౌలిక వసతుల కల్పన అనంతరం కాంట్రాక్టు సంస్థ అమృత్‌ 2.0 పనులు చేపట్టాల్సి ఉంది. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావడం, రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో అమృత్‌ 2.0 స్కీమ్‌ను నిలిపేసింది. మరోసారి టెండరు పిలిచే ఆలోచనల్లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని కడప, బద్వేల్‌, జమ్మలమడు పట్టణాలకు శుద్ధ జలాన్ని అందించడానికి ఐదేళ్లు సమయం తీసుకునే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.

➡️