కాకినాడ : సమయమైనా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాలేదు.. అధికారులూ లేరు.. ఈ పరిస్థితి కాకినాడలో సోమవారం జరిగింది. ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు సమయం అవుతున్నప్పటికీ ఎన్నికల ప్రక్రియ ఇంతవరకు ప్రారంభంకాలేదు. ఎన్నికల కార్యాలయంలోనే వైసీపీ కి వ్యతిరేకంగా టిడిపి వర్గీయులు నినాదాలు చేశారు. దీంతో ఎన్నికల ఆవరణంలో తీవ్రంగా గందరగోళం ఏర్పడింది. ఇరు పార్టీ నాయకులతో ఎన్నికల కార్యాలయం నిండిపోయంది. అధికారులెవ్వరూ అక్కడ కనిపించలేదు.
