ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : మండలం కొత్త మాజేరు శివారు పాత మాజేరు గ్రామానికి చెందిన చలమలశెట్టి సూరిబాబు క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులకు రావెళ్ల ఫౌండేషన్ ఛైర్మన్ రావెళ్ల ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పదివేల రూపాయలు ఆర్థిక సహాయం శుక్రవారం అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు నిడమానూరి దిలీప్ కుమార్, రావెళ్ల విజయ్ కుమార్, టీడీపీ నేతలు మోర్ల శివ, తుమ్మలగుంట గోపాలకృష్ణ, కమ్మెల పెదబాబు, బర్రా అగ్గి రాముడు, జనసేన నేత బండి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.