అభ్యర్థుల భవితవ్యం భద్రం

ప్రజాశక్తి – కడప ప్రతినిధిసార్వత్రిక ఎన్నికలు ప్రక్రియ ప్రశాం తంగా ముగిసింది. కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 30.54 లక్షల మంది ఓటర్లు తీర్పు నిచ్చారు. కడప పార్లమెంట్‌ పరిధిలో కడప, కమ లాపురం, మైదుకూరు, ప్రొద్దటూరు, జమ్మల మడుగు, పులివెందుల, బద్వేల్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో రాజంపేట, రాయ చోటి, రైల్వేకోడూరు, మదనపల్లి, పీలేరు, తంబ ళ్లపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి. కడప, రాజం పేట పార్లమెంట్‌ స్థానాల పరిధిలో 32 మంది, 13 అసెంబ్లీల పరిధిలో 180 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. వీరిలో ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపితోపాటు వైసిపి, కూటమికి చెందిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ నెలకొంది. వైసిపి, టిడిపి మధ్య 11 అసెంబ్లీ స్థానాలు, వైసిపి, కూటమి మధ్య రెండు స్థానాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది.ఎవరి ధీమా వారిదేకడప జిల్లాలోని పులివెందుల, బద్వేల్‌ స్థానాలపై వైసిపి ధీమాగా ఉంది. కడప, కమ లాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు అసెంబ్లీ స్థా నాలపై టిడిపి ధీమాగా ఉంది. ఇలా ఎవరికి వారి అంచనాలు వేసుకునే పనుల్లో నిమగమయ్యారు. వీరిలో ఎవరు గెలిచినా స్వల్ప ఓట్ల తేడాలతో గెలిచే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. అన్నమయ్య జిల్లా పరిధిలోని రాజంపేట, రాయచోటి, రైల్వేకో డూరు, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి నియో జకవర్గాల్లో నువ్వా నేనా అనే రీతిలో పోటీ నెల కొంది. మదనపల్లి, రాయచోటి స్థానాల్లో టిడిపి ఆశగా ఉంది. తంబళ్లపల్లిలో వైసిపి ధీమాగా ఉంది. రాజంపేట, పీలేరుల్లో హోరాహోరీ పోటీ వాతావరణంలో ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలిచిన స్వల్ప ఓట్ల తేడాలతో గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి తరుపున పోట పడుతున్న జమ్మలమడుగు, రైల్వేకోడూరు అభ్య ర్థులు సైతం హోరాహోరీగా తలపడినట్లు తెలు స్తోంది. గెలుపోటములపై పులివెందుల్లో ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ మెజార్టీ తగ్గుదల, కడప, ప్రొదుటూరు, కమలాపురంలో విజయావకాశాలపై పెద్దఎత్తున చర్చనడుస్తోంది.వైసిపికి ముచ్చెమటలు కడప పార్లమెంట్‌ బరిలో హోరాహోరీ పోటీ నడిచింది. వైసిపి అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి, టిడిపి అభ్యర్థి భూపేష్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి వైఎస్‌ షర్మిల మధ్య ముక్కోణపు పోటీని తలపించింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి తిరుగులేని మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ వివేకా హత్య కేసు ప్రధాన ఎజెండాగా మార డం, వైఎస్‌ కుటుంబంలో చీలిక రావడంతో వైసిపి అభ్యర్థికి ముచ్చె మటలు పట్టిస్తోంది. జమ్మల మడుగు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో టిడిపి ఓటర్లు సైతం షర్మిలకు ఓట్లేసినట్లు కనిపిస్తోంది.క్రాస్‌ ఓటింగ్‌ ఎవరిని ముంచేనో వైసిపి, టిడిపి నుంచి క్రాస్‌ ఓటింగ్‌ ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తుందో తెలియడం లేదు. అన్నమయ్య జిల్లాలో రాజంపేట పార్లమెంట్‌ బరిలో నిలిచిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కడప పార్లమెంట్‌ బరిలో వైసిపి తరుపున నిలిచిన సిట్టింగ్‌ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉందా అనేది చర్చనీయాంశంగా మారి ంది. రాజంపేట పార్లమెంట్‌ పరిధిలో కూట మి తరుపున బిజెపి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి, వైసిపి అభ్యర్థి పి.వి మిధున్‌రెడ్డి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. పీలేరు, తంబళ్లపల్లి, రాజంపేట నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి క్రాస్‌ ఓటింగ్‌ నడిచినట్లు తెలుస్తోంది. పుంగనూరు, రాయచోటి, మదనపల్లి, రైల్వేకోడూరు నియో జక వర్గాల్లో వైసిపి అభ్యర్థి పి.వి.మిధున్‌రెడ్డికి భారీగా ఓట్లు పడినట్లు కనిపిస్తోంది. ఏమైనప్పటికీ క్రాస్‌ ఓటింగ్‌ ఏమేరకు ఎవరికి ఏమోతాదులో పడిందనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కౌంటింగ్‌ సెంటర్‌ను పరిశీలించిన కమిషనర్‌ ప్రజాశక్తి – కడప అర్బన్‌ కమిషనర్‌ సూర్య సాయి ప్రవీణ్‌ చంద్‌ 2024 సర్వత్రిక ఎన్నికలకు సంబంధించి 7 నియోజకవర్గాల కౌంటింగ్‌ సెంటర్‌ (మన్ను కాలేజ్‌) లో వసతులను పరిశీలించారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్‌ రూములను తనిఖీ చేసి అనవసర వస్తువులను స్ట్రాంగ్‌ రూమ్స్‌లో ఉంచకుండా తీయించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీసు విభాగం వారితో మాట్లాడుతూ కౌంటింగ్‌ సెం టర్‌లో మూడు లేయర్ల బందోబస్తు వివరాలను పరిశీలించారు. కడప నియోజకవర్గానికి సంబంధించి ఇవిఎం బాక్సులను ఐరన్‌ రాక్స్‌ ఇచ్చినటువంటి పోలింగ్‌ స్టేషన్‌ నంబర్స్‌పైకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ బందాన్ని ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్‌ రూములలో ఇవిఎంలను చేర్చే విధంగా చర్యలు చేపట్టారు. ప్రతి నియోజకవర్గానికీ సంబంధించి ఇవిఎంలో నంబర్ల డేటాను ఏర్పాటు చేసి వాటి ప్రకారం ఇవిఎం రాక్స్‌లో అమర్చే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. కౌంటింగ్‌ సెంటర్‌కి ఇవిఎం మిషన్స్‌ తీసుకువచ్చిన ప్రతి ఒకరికీ అల్పాహారం, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయు విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున హమాలీల కోసం మజ్జిగ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలను ఇచ్చారు. సాయంత్రం లోగా అన్ని ఇవిఎం బాక్సులను ఆ నియో జకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్‌ రూములలో ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

➡️