రేపు ఉచిత గ్యాస్ పంపిణీ కి రంగం సిద్ధం

  •  ఇంచార్జ్ మంత్రి పర్యటన ఏర్పాటులను ముందస్తుగా పర్యవేక్షించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి

ప్రజాశక్తి రాయచోటి : పట్టణంలో రేపు శుక్రవారం అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాయచోటి పర్యటన సందర్భంగా పట్టణంలోని బంగ్లా సర్కిల్లో గల కాలేజీ గ్రౌండ్ లో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకం భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయనున్నారు. అందులో భాగంగా గురువారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పర్యటన జరుగు స్థలాన్ని పరిశీలించారు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున మహిళలు అధికారులు ,రానున్న సందర్భంగా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాసు బాబు, అధికారులు పాల్గొన్నారు.

➡️