భూఅక్రమాలపై పోరాటం ఉధృతం

భూఅక్రమాలపై పోరాటం ఉధృతం

ప్రజాశక్తి – మాడుగుల: మండలంలో యథేచ్ఛగా సాగుతోన్న భూఅక్రమాలు, దందాలపై పోరాటాలను ఉధృతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న, ఆర్‌ శంకరరావు పిలుపు నిచ్చారు. మంగళవారం శంకరం పంచాయతీలో సిపిఎం మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి అధ్యక్షతన మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశం మాట్లాడుతూ, ,పంచాయతీలోని అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమై పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పట్టణ ప్రాంతానికి చెందిన కొందరు అసైన్డ్‌ యాక్ట్‌ను ఉల్లంఘించి అసైన్డ్‌ భూములు అడ్డగోలుగా కొనుగోలు చేస్తున్నారని, ఇది పూర్తిగా చట్టవ్యతిరేకమైన చర్య అన్నారు. దీనిపై నూతన ప్రభుత్వం దృష్టి సారించి, అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూములను తిరిగి పేదలకు అప్పగించాలని, డిమాండ్‌ చేసారు. ఓమ్మలి పంచాయతీ ఉరలోవ కొండచుట్టూ 450 మందికి పట్టాలు ఇచ్చారని, అడ్డుకొండ, కొప్పు కొండమ్మ కొండ, నాగళ్ళ కొండ. భూములలో అనేక మంది రైతులు సాగుచేస్తున్నా ఆయా భూములకు పదేళ్లు గడుస్తున్నా అసైన్డ్‌ చేయలేదన్నారు.దీనిపై స్థానిక మండల తహశీల్దార్‌ సంబంధితశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి లేఖరాసినా అతీగతీ లేదన్నారు. మండలం పొడుగునా అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని, భూ అక్రమాలు, సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటాలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కె భవాని కె. దేవదాసు, మర్రి కృష్ణ, విజయశాంతి, మత్స్యరాజు, జానీ, అధిక సంఖ్యలో మహిళలు, గిరిజనులు పాల్గొన్నారు

]

మాడుగులలో సిపిఎం మండల స్థాయి విస్తత సమావేశం

➡️