ప్రజా సమస్యల పరిష్కారానికి పోరుబాట

Mar 12,2025 17:33

ప్రజాచైతన్యయాత్రలో సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-దత్తిరాజేరు :  ప్రజా సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి రాబోయే రోజుల్లో పోరుబాట పడతామని సిపిఎం నాయకులు జి.శ్రీనివాస్‌, వి.లక్ష్మి తెలిపారు. ప్రజాచైతన్యయాత్రలో భాగంగా బుధవారం దత్తిరాజేరు మండలం మానాపురంలో పర్యటించారు. రైల్వే లైన్‌ బాధితులు సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి డబ్బులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతనే బ్రిడ్జి పనులు చేపట్టాలని ఆందోళన చేసిన సందర్భంగా తహశీల్దార్‌ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని బాధితులు తెలిపారు. సిపిఎం నాయకులు స్పందిస్తూ ఈ సమస్య పరిష్కారానికి పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు. ఈనెల 17న తహశీల్దార్‌ను కలిసేందుకు బాధితులంతా రావాలని తెలిపారు. కార్యక్రమంలో సిహెచ్‌ గోవింద, ఎన్‌ వెంకటరమణ, ఎన్‌ గోవింద, డి గణేష్‌, ఎం.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజయరాంపురం గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. స్మశానానికి రోడ్లు, కాలువలు నిర్మించాలని, విద్యుత్‌ స్తంభాలు వేయాలని, రచ్చబండ కట్టించాలని గ్రామస్తులు కోరారు. ఉపాధి పనులు బిల్లులు ఆరు వారాలుగా పెండింగ్‌లో ఉన్నందున వాటిని చెల్లించేలా చర్లయు తీసుకోవాలని కోరారు.

విజయనగరం టౌన్‌ : స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సిపిఎం నాయకులను హుకుంపేట, శాంతినగర్‌ ప్రాంతాల ప్రజలు కోరారు. సిపిఎం ప్రజాచైతన్యయాత్ర ఆయా ప్రాంతాల్లో సాగింది. సిపిఎం నాయకులు పి.రమణమ్మ, బి.రమణమ్మ స్థానికులను సమస్యలడిగి తెలుసుకున్నారు. వీధి లైట్లు, ఇంటి పన్నులు వేయాలని , రోడ్లు, డ్రైనేజీ, కాలువలు వేయాలని ప్రజలు కోరారు, ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, సిపిఎం చేపట్టే పోరాటాల్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు .

➡️