ముగిసిన మొదటి విడత నైపుణ్యాభివృద్ధి శిక్షణ

ఆంధ్ర అగ్రికల్చర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ టెక్నాలజీ కళాశాల

ప్రజాశక్తి- విశాఖపట్నం : నగరంలోని కృష్ణరాయపురంలోని ఆంధ్ర అగ్రికల్చర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ టెక్నాలజీ కళాశాలలో మొదటి లెవెల్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ తరగతులు మంగళవారంతో ముగిసాయి. ఉన్నతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి విడత శిక్షణ తరగతులు ముగింపు సందర్భంగా ఆంధ్ర అగ్రికల్చర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ టెక్నాలజీ కళాశాల కరస్పాండెంట్‌ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ, తమ కాలేజీలో ఏటా30మంది విద్యార్థులకు ఇటువంటి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని, తద్వారా వారు మంచి కంపెనీల్లో ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నదే కాలేజీ ఉద్దేశ్యమన్నారు.కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌, స్కిల్స్‌ ప్రజెంటేషన్‌, సెల్ఫ్‌ అసెస్మెంట్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ ఇలా 15 అంశాలపై విద్యార్థులకు శిక్షణనిచ్చినట్లు తెలిపారు. రెండో లెవెల్‌ స్కిల్స్‌ డెవలపెమెంట్‌ తరగతులను ్‌ ప్రారంభిస్తున్నామని, ఈ విడతలోనూ 30 మందికే శిక్షణనిస్తాన్నారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌పై శిక్షణనిచ్చేందుకు తమ కాలేజీలో అనుభవిజ్ఞులైన అధ్యాపకులు ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ కాలేజీలో బిఎస్‌సి అగ్రికల్చర్‌, అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఉన్నతి ఫౌండేషన్‌ చైర్మన్‌ రమేష్‌స్వామి, కళాశాల ప్రిన్సిపాల్‌ నిహారిక, అధ్యాపకులు జ్యోతి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు

శిక్షణ పొందిన విద్యార్థులతో కాలేజీ కరస్పాండెంట్‌ ప్రతాప్‌రెడ్డి

➡️