పేదల జెండాను పీకేశారు

ప్రజాశక్తి-కంభం : కంభం గ్రామంలోని స్థానిక కందులాపం సెంటర్‌ కూడలిలో గత 20 సంవత్సరాలుగా ఏర్పాటు చేసిన సిఐటియు జెండాను ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేషనల్‌ హైవే అథారిటీ వారు పీకేశారు. ప్రతి కార్మికుడు మేడే కార్యక్రమంలో జెండాను ఆవిష్కరించుకుని రెడ్‌ సెల్యూట్‌ చెప్పుకుంటారు. అటువంటి సిఐటియు జెండాను అమానుషంగా పీకేయడం వలన ఇక్కడి కార్మికులు సవాల్‌గా మారింది. నేషనల్‌ హైవే అథారిటీ వాళ్లు సిఐటియు జెండా వారికి ఏ విధంగా అడ్డంగా ఉందని తొలగించారు సమాధానం చెప్పాల్సి ఉందని కంభం మండల సిఐటియు నాయకులు మరియు కార్మికులు డిమాండ్‌ చేశారు. సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు కంభంలోని స్థానిక కందులాపురం సెంటర్‌ కూడలి నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు పెద్దఎత్తున ర్యాలీ చేస్తామని, స్థానిక తహశీల్దారుకు వినతిపత్రం అందజేసి అదే స్థలంలో సిఐటియు జెండాను మరల ఆవిష్కరిస్తామని, కంభం మండల సిఐటియు నాయకులు షేక్‌ అన్వర్‌, దానం షేక్‌ ఖాజావలి, కొత్తూరు మల్లారపు రోశయ్య, కార్మికులు తెలియజేశారు.

➡️