ప్రజాశక్తి- రాచర్ల: రాచర్ల మండలం జెపిచెరువులో పసుపులేటి శ్రీనివాసులు అనే రైతు తన పొలంలో పొగాకు సాగు చేస్తున్నారు. ప్రక్క పొలంలో జామాయిలు సాగులో ఉంది. శ్రీనివాసులు తన పొలంలో పొగాకు నిల్వ కోసం జామాయిల్ కర్రతో షెడ్డు నిర్మించుకుంటున్నాడు. దీని కోసం అవసరమైన కర్ర తన పక్క పొలం యజమాని గుత్తుల వెంకటేశ్వరి నుండి రూ.30 వేలు పెట్టి కొనుగోలు చేసుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం అటవీశాఖ రేంజర్, గార్డు, వాచర్ ముగ్గురూ పసుపులేటి శ్రీనివాసులు షెడ్డు దగ్గరకు వచ్చి కర్రలు అటవీ శాఖ పరిధిలోనివని, నీపై కేసు బనాయించి జైల్లో పెట్టిస్తామని బెదిరించి రూ.65 వేలు పెనాల్టీ చెల్లించాలని డిమాండ్ చేశారు. కర్ర నేను కొనుగోలు చేశానని చెప్పినా వినకుండా ముందు నువ్వు పోలీస్ స్టేషన్‌కి నడువు అంటూ భయభ్రాంతులకు గురి చేశారని బాధితుడు వాపోయాడు. డబ్బులు చెల్లిస్తావా? జైలుకు వెళ్తావా? అంటూ తనను ఒత్తిడి చేస్తుండగా తన చిన్నాన్న భయపడి అటవీశాఖ అధికారులకు రూ.20,130 చెల్లించారు. దీనిపై విచారించి తగు న్యాయం చేయాలని బాధితుడు కోరారు. అటవీశాఖ అధికారుల తీరుపై విమర్శలుఈ ఘటనపై రాచర్ల మండల రైతులు అటవీశాఖ అధికారుల తీరుపై అనేక విమర్శలు గుప్పిస్తున్నారు. రైతులను అటవీశాఖ అధికా రులు జలగల్లా పీడిస్తున్నారని, ఇటీవల కాలంలో ఒక ఫారెస్ట్ అధికారి అటవీ ప్రాంతంలో నాటు సారా తయారు చేస్తూ పోలీస్ అధికారులకు దొరికిపోయారని, మరి కొంతమంది రైతుల దగ్గర పీడిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.