నూర్‌బాషా కార్పొరేషన్‌ ఏర్పాటు హర్షనీయం

ప్రజాశక్తి-మార్కాపురం: ఇటీవల జరిగిన రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నూర ్‌భాషా కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని, కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించడం పట్ల నూర్‌భాషా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దూదేకుల మస్తానయ్య హర్షం ప్రకటించారు. సిఎం చంద్ర బాబుతో పాటు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి ఎం.డి.ఫరూక్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మస్తానయ్య మార్కాపురంలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. నూర్‌భాషాలైన దూదేకుల కులస్తులకు ఈ కార్పొరేషన్‌ ద్వారా గౌరవం లభిస్తుందన్నారు. దూదేకులకు నామినేటెడ్‌ పదవులలో ప్రత్యేక స్థానం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూర్‌బాషా సంఘం పట్టణ అధ్యక్షులు డి.పెద్ద హుస్సేన్‌, డివిజన్‌ అధ్యక్షులు దూదేకుల ఖాశిం, డివిజన్‌ కార్యదర్శి డి.గురవయ్య, మార్కాపురం పట్టణ సంఘం సభ్యులు డి.ఖాశిం, డి.బాబు, డి.వలి తదితరులు ఉన్నారు.

➡️