ప్రజాశక్తి-చెరుకుపల్లిభవిష్యత్తు తరాలకోసం ప్రకతిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని డ్వామా పీడీ విజయలక్ష్మి అన్నారు. జాతీయ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని బలుసుల పాలెం పంచాయతీ అమ్మిరెడ్డి పాలెంలో అభివద్ధి చేసిన చెరువు వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డ్వామా పీడీ విజయలక్ష్మి, చెరుకుపల్లి ఎస్‌ఐ అనిల్ కుమార్, తహశీల్దార్ పద్మావతి, సర్పంచి కొనకాల నాగమల్లేశ్వరి, కొనకాల రవి కిరణ్ గౌడ్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ గత ఏడాది కేంద్ర ప్రభుత్వం అమత సరోవర్ పథకంలో భాగంగా అమ్మిరెడ్డిపాలెం చెరువును ఆధునికీకరించినట్లు తెలిపారు. భవిష్యత్తు తరాలకు ప్రకతి సంపదను అందించే లక్ష్యంతో అమత్ సరోవర్ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంఆర్‌కె మూర్తి, దివి రాంబాబు, మల్లాది రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.