ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణేే లక్ష్యం

Apr 23,2024 23:41

మాట్లాడుతున్న కలెక్టర్‌, పక్కన ఎస్పీ, ట్రైనీ కలెక్టర్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
పల్నాడు జిల్లాలో ప్రశాంతంగా స్వేచ్ఛా యుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా రెవిన్యూ, పోలీసు అధికారులు సంయుక్త కార్యాచరణతో ముందుకు వెళుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎల్‌. శివశంకర్‌ అన్నారు. మంగళవారం నరసరావుపేట కలెక్టరేట్‌లో ఎస్పీ జి.బిందు మాధవ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అన్ని శాఖల అధి కారులను అప్రమత్తం చేశామన్నారు. గత ఎన్నికల సమయంలో సంభవించిన హింసాత్మకంగా ఘటనలను పున:పరి శీలించామని, అటువంటి ఘటనలు పున రావృతం కాకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పల్నాడు జిల్లాలో మాచర్ల, కారంపూడి, గురజాల, సత్తెనపల్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఇటీవల వాటిల్లిన 17 రాజకీయ వివాదాల కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించామన్నారు. ఆయా కేసులలో కాల్‌ డేటా సెల్‌ టవర్‌ల ఆధారంగా నిందితులను గుర్తిం చినట్లు చెప్పారు. మీడియా కూడా చిన్న చిన్న ఘటనలు పెద్దవి చేసి చూపించ వద్ద న్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు రెవిన్యూ,పోలీసు శాఖ అధికారులు ప్రశాంత ఎన్నికల నిర్వహణకు చేస్తున్న కృషిని వివరించామన్నారు.ఎన్నికలు వస్తాయి… పోతాయి.. ఎస్పీ జి.బిందు మాధవ్‌ఎన్నికలు వస్తాయి.. పోతాయని, స్నేహాలు,బంధుత్వాలు శాశ్వతమని, ప్రతి ఒక్కరూ బంధు ప్రీతితో స్నేహపూర్వక వాతావరణంలో మెలగాలని ఎస్పీ జి.బిందు మాధవ్‌ అన్నారు. ప్రధానంగా ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువత ఎన్నికల వివాదాలలో తల దూర్చి జీవితాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని, పల్నాడు జిల్లాలో ఏ పోలీసు స్టేషన్‌కు అర్ధరాత్రి ఫోన్‌ చేసినా సిబ్బంది తక్షణమే స్పందిస్తారని చెప్పారు. తెల్లవారేసరికి ఎఫ్‌.ఐ.ఆర్‌ చేయ డం జరుగుతుందని చెప్పారు. పార్టీలక తీతంగా పోలీసు శాఖ నిబద్ధతగా విధు లను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలను విభజించి అనేకమార్లు పర్య టించి అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పామని, స్వేచ్ఛ వాతావరణంలో ఓటు విని యోగించుకునేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో అన్ని గ్రామాలలో సిఆర్పిఎఫ్‌ బలగాలతో పోలీసు కవాతు నిర్వహించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని అన్నారు. ఇటీవల కాలంలో బైండోవర్‌ కేసుల సంఖ్య పెరిగాయని, పల్నాడు జిల్లాలో ఇటీవల కాలంలో నమోదైన 17 రాజకీయ వివాదాలకు సంబంధించి 14 కేసులలో నిందితులను గుర్తించి రిమాండ్‌ కు తరలించామని, మరో 3 కేసులు విచారణ చివరి దశలో ఉన్నట్లు చెప్పారు. ఈ కేసులు మొత్తం కూడా పథకం ప్రకారం జరిగినవి కాదని క్షణికావేశంలో జరిగినట్లు తమ విచారణలో తేలినట్లు చెప్పారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ట్రైనీ కలె క్టర్‌ కల్పశ్రీ, రెవెన్యూ అధికారి కె వినాయకం తదితరులు పాల్గొన్నారు.

➡️