మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ప్రజాశక్తి-రామాపురం ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి విశేష కషి చేస్తుందని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని గువ్వలచెరువులో నూతనంగా నిర్మించిన మసీదును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం మైనార్టీలకు అనేక పథకాలు అమలు చేసి వారి సంక్షేమానికి కషి చేసిందన్నారు. రాయచోటి నియోజకవర్గంలో ఎక్కువ మంది మైనార్టీలు ఉన్నారని వీరికి ప్రభుత్వం కల్పించిన పథకాలన్నీ అర్హులందరికీ అందేటట్లు చూస్తామని తెలిపారు. అర్హులైన మైనార్టీలందరికీ ఇళ్లు, పెన్షన్లు, తదితర ప్రభుత్వ పథకాలన్నీ అందజేసి వారి అభివద్ధికి తమ వంతు కషి చేస్తామని పేర్కొన్నారు. మసీదు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత మెగావైద్య శిబిరంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించిన డాక్టర్లను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మండలంలోని మైనార్టీ సోదరులు, మంత్రిని గజమాలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పలువురు ముస్లిం మత పెద్దలు, టిడిపి నాయకులు, బాలిసెట్టి చంద్రమౌళి, రేఖం ఆంజనేయులు బ్రదర్స్‌ చెన్న కృష్ణారెడ్డి, ఇలియాజ్‌ హరి ప్రసాద్‌, ఈశ్వరయ్య, సుధాకర్‌, ఆజాం, తిమ్మారెడ్డి ధనుంజయ, దర్బార్‌, అరిఫ్‌, సర్ఫరాజ్‌, నాగరాజు, వెంకటరామిరెడ్డి, హరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.అభివద్ధితో రాయచోటి రూపురేఖలు మారుస్తాం చిన్నమండెం :రాయచోటి నియోజకవర్గంలో వివిధ అభివద్ధి కార్యక్రమాలు నిర్వహించి పట్టణ రూపురేఖలు మారుస్తామని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బోరెడ్డి గారిపల్లెలోని తమ నివాసంలో మంత్రి ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎటువంటి అభివద్ధికి నోచుకోని రాయచోటి నియోజకవర్గం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు, మంచినీటి సమస్య పరిష్కరించడం, డ్రెయినేజీ కాలువలు, వీధిలైట్లు, తదితర అభివద్ధి కార్యక్రమాలు అమలు చేసి నియోజకవర్గ రూపు రేకులు మార్చడం జరుగుతోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం 9 నెలల కాలంలోనే ప్రాధాన్యత క్రమంలో అవసరమైన గ్రామాలలో సిమెంట్‌ రోడ్లు ఏర్పాటు చేసి గ్రామాలను అభివద్ధి చేశామని పేర్కొన్నారు. నీటి సమస్యతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వివిధ గ్రామాలలో నూతన బోర్లు వేసి మోటార్‌ బిగించి గ్రామాలకు నీరు విడుదల చేస్తున్నామని తెలిపారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి నిరంతరం గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే బాధితుల సమస్యలు పరిష్కరించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది. క్రికెట్‌ అకాడమీ ప్రారంభోత్సవానికి మంత్రికి ఆహ్వానంరాయచోటి : రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి ఆదివారం రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈనెల 23వ తేదీ విభా క్రికెట్‌ స్పోర్ట్స్‌ అకాడమీని తమ చేతుల మీదుగా ప్రారంభించాలని ఆదివారం ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయచోటి పట్టణంలో విభా క్రికెట్‌ స్పోర్ట్స్‌ అకాడమీని ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి తప్పకుండా హాజరవుతానని క్రికెట్‌ స్పోర్ట్స్‌ అకాడమీ నిర్వాహకులకు మంత్రి తెలిపారు.నూతన బోరును ప్రారంభించిన మంత్రి సంబేపల్లి : రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆదివారం సంబేపల్లి మండలం, సుద్దలవాండ్లపల్లె గ్రామంలో నీటి సమస్య పరిష్కరించేందుకు నూతన బోరును ప్రారంభించారు. అనంతరం మంత్రి టిడిపి సభ్యత్వం పొందిన అభ్యర్థులకు టిడిపి సభ్యత్వ నమోదు కార్డులు పంపిణీ చేశారు. జగన్నాథం ఆహ్వానం మేరకు మంత్రి ఆయన ఇంటిలో విందు భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంబేపల్లి మండల ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు మంత్రి ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికి శాలువా గజమాలతో ఘనంగా సన్మానించారు.

➡️