ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తూనే వారి భవిష్యత్తు నిర్మాణానికి ప్రభుత్వం బాటలు వేస్తోందని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 7వ తేదీన బాపట్లకు రానున్నారు. ఈ నేప థ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో మంగళవారం స్థానిక బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ముందస్తు సమా వేశం జరిగింది. విద్యార్థుల స్థాయిని గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికితీయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. పిల్లలను సరిదిద్దడం, చైతన్య పర చడం, ఉన్నతంగా ఎదగడానికి అవకాశాలు కల్పించడమే ముఖ్య ఉద్ధేశ్యం అన్నారు. పిల్లల భవిష్యత్తు నిర్మాణానికి పునాదులు వేసేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంద న్నారు. విద్యార్థులు చదువులో ఎలా ఉన్నారో వారి స్థాయిని గుర్తించడం, క్రమశిక్షణ, నైతిక ప్రవర్తన, మానసిక స్థితిని గుర్తించడానికే సమావేశాలను ప్రభుత్వం ప్రారంబి óస్తుందన్నారు. ఇతర రాష్ట్రాలలో అమలయ్యే విధానాలను గుర్తించి మరింత మెరుగ్గా రాష్ట్రంలోని విద్యా విధానం అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బాపట్ల జిల్లాలోని అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాలు డిసెంబర్ 7వ తేదీన జరుగుతాయన్నారు. 135 సంవత్స రాల చరిత్ర ఉన్న బాపట్ల మున్సిపల్ పాఠశాలలో జరిగే సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్నారని తెలిపారు. ఉదయం 9 గంటలకు సమావేశం మొదలవు తుందని, విద్యార్థుల ప్రోగ్రెస్‌పై చర్చ జరుగుతుందన్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికి ఇక్కడే చదివి విభిన్న రంగాలలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. సమావేశానికి హాజరయ్యే తల్లులకు ముగ్గులు పోటీ నిర్వహిస్తామని, టగ్గాఫ్ వార్ పోటీలు జరుపుతా మన్నారు. విజయం సాధించిన తల్లిదండ్రులకు ముఖ్య మంత్రి బహుమతులు అందజేస్తారన్నారు. తదుపరి సహపంక్తి భోజనంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదం డ్రులు, అధికారులు పాల్గొంటారని చెప్పారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులు: ఎమ్మెల్యే నరేంద్ర వర్మప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. దేశాభివృద్ధికి విద్యార్థులే వెన్నెముక లాంటివారని, వారి కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు. జవాబుదారీ తనంతో ఉపాధ్యాయులు పని చేయాలని, చక్కగా విద్యాబోధన అందించాలన్నారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులుగా మారతారని, అలాంటి వారిని చక్కగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంద న్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తే విద్యా ర్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఇందు కోసం సీఎం విశేషంగా కృషి చేస్తున్నారని వివరిం చారు. విద్యతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. బాపట్లలో 1889లో ప్రారంభమైన పాఠశాలదేశ నిర్మాణం తరగతి గదిలోని ప్రారంభమ వుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. విద్యతోనే దేశం పురోభివృద్ధిలో పయనిస్తుందని చెబుతూ నిరోపితమైన విషయాలను ఆయన ఉటంకిం చారు. సిఎమ్ పాల్గొంటున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీ టింగ్ జరుగనున్న బాపట్ల పాఠశాల 1889లో ప్రారం భమైందన్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 912 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. దేశంలో మేధా వులు, శాస్త్రవేత్తలంతా పాఠశాలల్లో ఓనమాలు దిద్దిన వారే నని బాపట్ల ఆర్డీవో పి.గ్లోరియా చెప్పారు. పాఠశాలలో జరిగే తల్లిదండ్రుల సమావేశాన్ని జయప్రదం చేయాల న్నారు. విద్యతోనే భవిష్యత్తు ఉంటుందని బెటర్ ఫర్ బాపట్ల అధ్యక్షుడు సాయిబాబా తెలిపారు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులలో ఆరుగురు పద్మశ్రీ అవార్డులు పొంది న వారు, మరో ఆరుగురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారని గుర్తు చేశారు. పూర్వ విద్యార్థులను ఆహ్వానిం చడం శుభపరిణామం అన్నారు. ఈ సమావేశంలో మున్సి పల్ కమిషనర్ రఘునాథరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.